మొన్న సన్నీ లియోన్‌.. నేడు నేహాకక్కర్

మొన్న కోల్‌కతాలోని ఓ కాలేజీ ప్రకటించిన మెరిట్ లిస్ట్‌లో టాపర్‌గా బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరు వచ్చిన విషయం తెలిసిందే.

  • Tv9 Telugu
  • Publish Date - 12:09 pm, Mon, 31 August 20
మొన్న సన్నీ లియోన్‌.. నేడు నేహాకక్కర్

Neha Kakkar name: మొన్న కోల్‌కతాలోని ఓ కాలేజీ ప్రకటించిన మెరిట్ లిస్ట్‌లో టాపర్‌గా బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరు వచ్చిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వగా.. ఎవరో ఆకతాయిలు ఈ పని చేశారని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఆ కాలేజీ యాజమాన్యం తెలిపింది. దీనిపై సన్నీ స్పందిస్తూ.. మీ అందరినీ వచ్చే సెమిస్టర్‌లో కలుస్తాను అంటూ కామెంట్ పెట్టారు. ఇక ఇది గడిచి మూడు రోజులు కూడా అవ్వకముందే ఇప్పుడు మరో కాలేజీ మెరిట్ లిస్ట్‌లో సింగర్ నేహా కక్కర్ పేరు దర్శనమిచ్చింది.

మల్దా జిల్లాలోని మానిచక్‌ కాలేజీ విడుదల చేసిన మెరిట్‌ లిస్ట్‌లో నేహా కక్కర్‌ పేరు కనిపించింది. దీనిపై ఆ కాలేజీ ప్రిన్సిపల్ అనిరుద్దా చక్రవర్తి మాట్లాడుతూ.. మెరిట్‌ లిస్ట్‌లో తప్పు వచ్చిందని తెలిసిన వెంటనే దాన్ని సర్దుకున్నామని తెలిపారు. దీనిపై పోలీస్ స్టేషన్‌, సైబర్ క్రైమ్‌ సెల్‌లో ఫిర్యాదు చేశాము. ”మా కాలేజీలో అడ్మిషన్ పద్దతి మొత్తం కోల్‌కతాలోని ఓ ఏజెన్సీ ద్వారా జరుగుతుంది. అడ్మిషన్ కోసం ఎవరు అప్లై చేసుకున్నారన్న దానిపై మాకు ఎలాంటి సమాచారం ఉండదు” అని చక్రవర్తి అన్నారు. ”కాలేజీ అడ్మిషన్‌ ప్రాసెస్‌ను రాష్ట్ర ప్రభుత్వం పారదర్శంగా చేపడుతోంది. అయితే కొంతమంది ఆకతాయిలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. దీన్ని కచ్చితంగా ఖండిస్తున్నాము.” అని చక్రవర్తి తెలిపారు.

Read More:

క్షీణిస్తోన్న ప్రణబ్‌ ఆరోగ్యం

కరోనాతో దేశ మొదటి మహిళా కార్డియాలజిస్ట్‌ మృతి