లాక్‌డౌన్.. మూడు నెలల తరువాత ఇంటికి చేరుకున్న స్టార్ హీరో..!

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 7:05 pm, Fri, 22 May 20
లాక్‌డౌన్.. మూడు నెలల తరువాత ఇంటికి చేరుకున్న స్టార్ హీరో..!

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా ఎక్కడివారు అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. షూటింగ్‌ల నిమిత్తం విదేశాలకు వెళ్లిన కొందరు సినీ ప్రముఖులు విమానాలు తిరగకపోవడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన ‘ఆదుజీవితం’ షూటింగ్ నిమిత్తం జోర్దాన్‌కి వెళ్లిన మలయాళం స్టార్ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమార్ టీమ్‌తో సహా అక్కడ చిక్కుకున్నారు. దాదాపు మూడు నెలలుగా ఆ టీమ్ అక్కడే ఉండిపోయింది. ఇక తాజాగా గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఈ బృందం న్యూఢిల్లీకి చేరుకుంది.

ఇక కేరళకు వచ్చిన వారందరు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. కాగా కరోనా నేపథ్యంలో షూటింగ్‌కు బ్రేక్ పడటంతో పృథ్వీరాజ్ టీమ్ చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని కేరళ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఆ మూవీ దర్శకుడు బ్లెస్సీ కేరళ ఫిలిం ఛాంబర్‌కి రిక్వెస్ట్ చేశారు. కాగా భారత్‌కి వచ్చిన విషయాన్ని పృథ్వీ సోషల్ మీడియాలో తెలిపారు. టీమ్‌ మొత్తం సేఫ్‌గా ఉందని ఆయన వివరించారు. కాగా పృథ్వీని తమ కుమార్తె చాలా మిస్ అవుతుందని, ఆయన రాక కోసం తామంతా ఆతృతగా ఎదురుచూస్తున్నామని ఈ హీరో భార్య సుప్రియా మీనన్‌ పలుమార్లు సోషల్ మీడియాలో తెలుపుతూ వస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: ఏపీ ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..!