AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Pragathi: తన చేతిపై టాటూ సీక్రెట్ రివీల్ చేసిన నటి ప్రగతి..

నటి ప్రగతి తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలు. ఆమె స్లాంగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. నటిగా పక్కనబెడితే పవర్ లిఫ్టింగ్‌లోనూ ఆమె సత్తా చాటుతున్నారు. ఇంటర్నేషనల్ లెవల్‌లో పతకాలు సాధిస్తున్నారు. అయితే ప్రగతి భుజంపై ఉన్న టాటూ గురించి ఆమె ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు.

Actress Pragathi: తన చేతిపై టాటూ సీక్రెట్ రివీల్ చేసిన నటి ప్రగతి..
Actress Pragathi
Ram Naramaneni
|

Updated on: Jun 09, 2026 | 1:17 PM

Share

ప్రముఖ నటి ప్రగతి తన టాటూ వెనుక ఉన్న ఆసక్తికరమైన, వ్యక్తిగత కథను వెల్లడించారు. సాధారణంగా సెలబ్రిటీలు ఫ్యాషన్ కోసం టాటూలు వేయించుకోవడం చూస్తుంటాం. కానీ, ప్రగతి చేతిపై ఉన్న టాటూ వెనుక ఒక ప్రత్యేకమైన, భావోద్వేగమైన కారణం ఉంది. చిన్నతనంలో వేయించిన వ్యాక్సినేషన్ కారణంగా ప్రగతి చేతిపై తీవ్రమైన సెప్టిక్ అయ్యింది. దీనివల్ల ఆమె చేతిపై ఒక పెద్ద కాలియ గాయం లాంటి మచ్చ ఏర్పడింది. ఈ మచ్చ ఆమెకు చాలా కాలం అసౌకర్యాన్ని కలిగించింది. మచ్చను చూసిన ప్రతి ఒక్కరూ “ఇక్కడ ఏమైంది? ఎలా అయ్యింది?” అని పదే పదే అడగడం వల్ల ఆమె మానసికంగా ఇబ్బంది పడ్డారు. ఇటువంటి ప్రశ్నలను తప్పించుకోవడానికి ఆమె తరచుగా జాకెట్‌లు ధరించాల్సి వచ్చేది. తన వ్యక్తిత్వాన్ని వదిలేసి, ఆ మచ్చ గురించే అందరూ అడగడం ఆమెను కలచివేసింది. ఈ అసౌకర్యాన్ని అధిగమించడానికి, ఆ మచ్చను శాశ్వతంగా కప్పిపుచ్చడానికి ప్రగతి టాటూ వేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. టాటూ వేయించుకున్న తర్వాత ఆమె జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఎవరైతే గతంలో మచ్చ గురించి అడిగేవారో, వారే ఇప్పుడు “చాలా బాగుంది, ఇట్స్ సో కూల్, ఇట్స్ సో నైస్” అని ప్రశంసించడం ప్రారంభించారు. ఈ టాటూ ఇప్పుడు ప్రగతికి ఒక కొత్త గుర్తింపును ఇచ్చింది. తన జుట్టు తన ఐడెంటిటీ అయినట్టే, ఈ టాటూ కూడా తన మేజర్ ఐడెంటిటీలలో ఒకటిగా మారిందని ఆమె సంతోషంగా చెప్పారు. ఒక సాధారణ ఐడియా తన జీవితాన్ని, ఇతరుల అభిప్రాయాన్ని ఏ విధంగా మార్చివేసిందో ప్రగతి ఈ సందర్భంగా వివరించారు.

ఇక ఫిట్‌నెస్ అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రగతి వెల్లడించారు. తాను చాలా పెద్ద ఫుడ్డీనని, బాగా తింటానని ఒప్పుకున్నారు.  అయితే, ఇంత తిన్నా బరువు పెరగకుండా ఎలా ఉండగలుగుతున్నారనే ప్రశ్నకు సమాధానంగా, జీవితంలో అన్నింటికీ సమతుల్యత అవసరమని ప్రగతి వివరించారు. కేవలం తినకుండా ఉండటం, కడుపు మాడ్చుకోవడం సరైన పద్ధతి కాదని ఆమె అన్నారు. తిండిని ఆస్వాదిస్తూనే, దానికి తగిన శారీరక శ్రమ చేయడం, వ్యాయామం చేయడం ప్రధానమని ఆమె సూచించారు. తిండి తినకుండా, కడుపు మాడ్చుకుని వ్యాయామం చేస్తే అనారోగ్యంగా కనిపిస్తారని ప్రగతి అభిప్రాయపడ్డారు. జీవితాన్ని ఆనందంగా గడపడానికి, చక్కగా వండుకుని తినడం, ఎంజాయ్ చేయడం, అలాగే వ్యాయామం చేయడం – ఇవన్నీ ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో మదర్ క్యారెక్టర్స్ వేసేవారు కూడా హీరోయిన్లతో పోటీ పడాల్సిన అవసరం లేదని, కానీ వారి పాత్రలకు కాంప్లిమెంట్ అవ్వాలని ప్రగతి పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us