Home Tour: స్టార్ హీరోలకు పోటీగా ప్యాలెస్‌లాంటి ఇల్లు సొంతం చేసుకున్న హీరోయిన్ పూనమ్ బజ్వా! మీరూ చూసేయండి
ఆశించిన అవకాశాలు లేకపోయినా, కెరీర్లో హిట్ సినిమాలు పడకపోయినా తనదైన నటన, గ్లామర్‌తో పాటు తన పెట్టుబడులతోనూ వార్తల్లో నిలుస్తోంది ఓ హీరోయిన్. ఇటీవల ఆమె కోట్లు వెచ్చించి ఒక అతిపెద్ద, విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేయడం సినీ వర్గాల్లో సంచలనం ..

ఆశించిన అవకాశాలు లేకపోయినా, కెరీర్లో హిట్ సినిమాలు పడకపోయినా తనదైన నటన, గ్లామర్‌తో పాటు తన పెట్టుబడులతోనూ వార్తల్లో నిలుస్తోంది ఓ హీరోయిన్. ఇటీవల ఆమె కోట్లు వెచ్చించి ఒక అతిపెద్ద, విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేయడం సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.
ఈ హీరోయిన్ ఇంత తక్కువ కాలంలోనే ఇన్ని కోట్ల ఆస్తులను ఎలా సంపాదించింది? కేవలం సినిమా పారితోషికాలేనా, లేక దీని వెనుక మరేదైనా వ్యాపార వ్యూహం ఉందా? విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న ఆమె, వ్యక్తిగత జీవితంలో తీసుకున్న ఈ పెద్ద నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? ఇంతకీ ఎవరా హీరోయిన్?
మొదటి సినిమాతో..
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో తనదైన ముద్ర వేసిన నటి పూనమ్ బజ్వా. 2005లో తెలుగులో వచ్చిన ‘మొదటి సినిమా’ ద్వారా తెరంగేట్రం చేసిన ఈ నటి, ఆ తర్వాత కన్నడ, తెలుగు భాషల్లో నటించి, 2008లో హరి దర్శకత్వంలో వచ్చిన ‘సేవల్’ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ‘కచ్చేరి ఆరంభం’, ‘తెనవట్టు’, ‘తంబికోట్టై’, ‘అరన్మనై 2’ వంటి విజయవంతమైన సినిమాల్లో మెరిసిన పూనమ్, ఎక్కువగా పల్లెటూరి అమ్మాయి పాత్రల ద్వారా ప్రేక్షకులకు చేరువైంది.
హీరోయిన్గా అవకాశాలు తగ్గినప్పటికీ, ‘కుప్పత్తు రాజా’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ, నటిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో, సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా చురుకుగా ఉంటూ, తరచుగా తన గ్లామర్ ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. దాదాపు 27 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉన్న పూనమ్, ఇటీవల బరువు కూడా తగ్గి మరింత ఫిట్‌గా మారింది.
ఇల్లా.. లేక ప్యాలెసా?
తన సినీ జీవిత ప్రయాణం ఒక దశాబ్దానికి పైగా కొనసాగిన తర్వాత, పూనమ్ బజ్వా తాజాగా తన కలల సౌధాన్ని నిర్మించుకుంది. హైదరాబాద్ నగరంలో ఒక ముఖ్యమైన ప్రాంతంలో నిర్మించిన ఈ కొత్త ఇంటికి మారిన తర్వాత, ఆమె తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక ‘హోమ్ టూర్* వీడియోను విడుదల చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నా పాత ఇంట్లో ఇన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత, నేను చివరకు ఇక్కడికి మారాను. ఈ రోజు నేను నా సరికొత్త ఇంటి తలుపులు తెరుస్తున్నాను. ఈ ఇల్లు నాకు చాలా ప్రత్యేకం. ఇది ఒక కొత్త ప్రారంభం, కొత్త జ్ఞాపకాలకు వేదిక. నేను అత్యంత ప్రేమతో నిర్మించిన ఈ ఇల్లు నా జీవితంలో ఒక గొప్ప భాగం” అని చెప్పుకొచ్చింది.
పూనమ్ బజ్వా ఎంతగానో కష్టపడి నిర్మించుకున్న ఇంటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఇంటి నిర్మాణ శైలి, ఇంటీరియర్ డిజైన్, ఆధునిక సదుపాయాలను చూసి, “ఇది ఇల్లా, లేక నిజమైన రాజభవనమా?” అనే కామెంట్లతో ముంచెత్తున్నారు. పూనమ్ బజ్వా సినీ కెరీర్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో ఆమె ఈ స్థాయి విజయాన్ని సాధించడం, తన కలల సౌధంలోకి అడుగుపెట్టడం ఆమె పట్టుదలకు నిదర్శనం. ఆమెకు కొత్త ఇంట్లో ఈ కొత్త ప్రారంభం మరిన్ని ఆనందాలను, విజయాలను తీసుకురావాలని ఆశిద్దాం.




