AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manjari Fadnis: ఐరన్ రాడ్‌తో కొట్టి చంపేశారు.. కన్నీరుమున్నీరవుతోన్న ‘శక్తి’ హీరోయిన్.. ఏం జరిగిందంటే?

మంజరి ఫడ్నిస్ ఇప్పుడు ఎక్కువగా హిందీ సినిమాల్లోనే నటిస్తోంది.. అయితే తెలుగు ఆడియెన్స్ కు కూడా ఈ అమ్మడు బాగా పరిచయమే. గతంలో ఎన్టీఆర్ శక్తి, శుభప్రదం, సిద్దూ ప్రమ్ శ్రీకాకుళం తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది మంజరి.

Manjari Fadnis: ఐరన్ రాడ్‌తో కొట్టి చంపేశారు.. కన్నీరుమున్నీరవుతోన్న 'శక్తి' హీరోయిన్.. ఏం జరిగిందంటే?
Manjari Fadnis
Basha Shek
|

Updated on: Jun 09, 2026 | 12:21 PM

Share

తెలుగుతో పాటు హిందీలో హీరోయిన్ గా చేసిన మంజరి ఫడ్నిస్ కన్నీరుమున్నీరవుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఎమోషనల్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తమ హౌసింగ్ సొసైటీలో ఎంతో మంచిగా ఉండే ‘మైకీ’ అనే కుక్కను కొందరు వ్యక్తులు అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారని ఈ సందర్భంగా వాపోయింది మంజరి. ‘మా హౌసింగ్ సొసైటీలో ఎంతో మంచిగా ఉండే మైకీ అనే కుక్కను కొందరు వ్యక్తులు అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. మైకీ ని యజమానులు వదిలేసి వెళ్లగా, 2019 నుంచి మా సొసైటీ ఆవరణలోనే ఉంటూ అందరితో ఎంతో ప్రేమగా ఉండేది. గత కొన్ని రోజులుగా మైకీ కనిపించకుండా పోవడంతో, మేమంతా ఎంతో ఆందోళనకు గురయ్యాం. చాలా చోట్ల వెతికాం. పోస్టర్లు కూడా వేయించాం. సెక్యూరిటీ గార్డులను, ఇతరులను విచారించాం. కానీ సొసైటీకి చెందిన కొందరు వ్యక్తులు మైకీ తలపై ఇనుప రాడ్ తో బలంగా కొట్టారు. దీంతో అది స్పృహ కోల్పోయింది. అంతటితో ఆగకుండా ఆ మూగజీవాన్ని బేస్‌మెంట్ నుంచి కింద‌కి ఈడ్చుకెళ్లి, నోటి నుంచి రక్తం వచ్చేలా మళ్లీ విచక్షణారహితంగా బాదారు. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఆ జీవాన్ని ఒక గోనె సంచిలో కుక్కి వెనుక ఉన్న నిర్జన ప్రదేశంలో పడేశారు. మైకీ ఇంకా బతికే ఉందో లేదో కూడా తెలియదు. ప్రస్తుతం తామంతా దాని బాడీ కోసం గాలిస్తున్నాం. ఇలాంటి నేరపూరిత ఆలోచనలు ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’.

‘మా మైకీని క్రూరంగా హత్య చేశారు. దాని న్యాయం కోసం మేం ఖచ్చితంగా పోరాడుతాం. మూగజీవాలను హింసించాలంటేనే ప్రజలు భయపడేలా జంతు హింసకు వ్యతిరేకంగా మన దేశంలో మరింత కఠినమైన చట్టాలు రావాలి. మా పోరాటంలో అండగా నిలిచిన సొసైటీ సభ్యులు జేవియర్ బెర్నార్డ్ శాంటియాగో, సంకేత్ కదమ్, ఇతరులకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను’ అని వీడియోలో చెప్పుకొచ్చింది మంజరి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. భూమి పెడ్నేకర్, వేదిక, డింపుల్ హయాతీ తదితర సినీ ప్రముఖులు మంజరికి తమ మద్దతును ప్రకటించారు.అలాగే నెటిజన్లు కూడా భారీగా మంజరికి సపోర్టుగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మంజరి ఫడ్నిస్ షేర్ చేసిన వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us