Keerthy Suresh : సర్కారు వారిపాట కోసం లుక్ మారుస్తున్న కీర్తిసురేష్.. ఈసారి అలా కనిపించనుందట..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా 'సర్కారు వారి పాట' ఈ సినిమాకు 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.

Keerthy Suresh : సర్కారు వారిపాట కోసం లుక్ మారుస్తున్న కీర్తిసురేష్.. ఈసారి అలా కనిపించనుందట..!
Follow us

|

Updated on: Jan 12, 2021 | 6:16 PM

Keerthy Suresh : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’ ఈ సినిమాకు ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా అందాల భామకీర్తి సురేష్ నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో సినిమా ఉండనుందని మొదటినుంచి ప్రచారం జరుగుతుంది.

కాగా ఈ సినిమా కోసం కీర్తి సురేష్ తన లుక్ ను మార్చుకోబోతుందని తెలుస్తుంది. ఇటీవల బరువు తగ్గి సన్నజాజిలా మారిన కీర్తి ఈ సినిమాకోసం కాస్త బొద్దుగా మారనుందట. ‘సర్కారు వారి పాట’ సినిమాలో తన పాత్రకు అనుగుణంగా  కీర్తి సురేష్ కాస్త బరువు పెరగనుందని తెలుస్తుంది. ఈ సినిమా ఎక్కువ భాగం యూఎస్ బ్యాక్ డ్రాప్ లో సాగ‌నుంది. దాంతో కీర్తి అటు అమెరికెన్ గా, ఇటు ఇండియన్ గా కనిపించేందుకు త‌న మేకోవ‌ర్ ను మార్చుకునేందుకు రెడీ అవుతుందని టాక్‌. ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. మొదటి షడ్యూల్ ను దుబాయ్ లో ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు పరశురామ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vakeel Saab: అందుకే పవర్ స్టార్ ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని ఒప్పుకున్నారట.. సేనాని మనసులో మాట

FWICE bans RGV: ఆర్టిస్టులకు, టెక్నిషియన్లు కోటికి పైగా ఎగనామం..! ఆర్జీవీపై బ్యాన్ విధించిన సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్..