Ileana D’cruz: ఆనందంలో స్టెప్పులేస్తోన్న ఇలియానా.. ఇంతకీ ఈ సంతోషానికి కారణమేంటీ ఇల్లీ బేబీ..?

Ileana D'cruz: రామ్‌ హీరోగా నటించిన 'దేవదాసు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార ఇలియానా. తొలి సినిమాతోనే నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ చిన్నది తర్వాత వరుస అవకాశాలను...

Ileana D'cruz: ఆనందంలో స్టెప్పులేస్తోన్న ఇలియానా.. ఇంతకీ ఈ సంతోషానికి కారణమేంటీ ఇల్లీ బేబీ..?

Ileana D’cruz: రామ్‌ హీరోగా నటించిన ‘దేవదాసు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అందాల తార ఇలియానా. తొలి సినిమాతోనే నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ చిన్నది తర్వాత వరుస అవకాశాలను సొంతం చేసుకుంది. తెలుగులో కోటి రూపాయలు రెమ్యునరేషన్‌ తీసుకున్న తొలి హీరోయిన్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకుందీ గోవా బ్యూటీ. అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకున్న ఈ చిన్నది.. టాప్‌ హీరోలందరితో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఒకానొక సమయంలో తెలుగులో ఫుల్‌ బిజీ హీరోయిన్‌గా మారిన ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్‌ బాట పట్టింది. అక్కడ కూడా వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది.

అయితే అనంతరం ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ గ్రాఫ్‌ ఒక్కసారిగా పడిపోయింది. ఇలియానా చాలా రోజుల పాటు సినిమాల్లో కనిపించలేదు. ఆ మధ్య వ్యక్తిగత కారణాల వల్ల ఇలియానా కొంత డిస్ట్రబ్‌ అయ్యిందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక తెలుగులో చివరిగా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ సినిమాలో కనిపించిన ఈ చిన్నది మళ్లీ సినిమాలో నటించలేదు. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో కేవలం ఒకే సినిమా ఉంది.

ఇదిలా ఉంటే ఇలియానా తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చేసిన ఓ పోస్ట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సంతోషంతో చిందులు వేస్తోన్న సమయంలో తీసిన ఓ వీడియోను పోస్ట్‌ చేసిన ఇలియానా.. ‘హ్యాపీ డ్యాన్స్‌’ అనే క్యాప్షన్‌ను జోడించింది. దీంతో ఇలియానా అంతలా సంతోషించడానికి కారణం ఏమై ఉంటుందని ఆమె అభిమానులు ఆలోచిస్తున్నారు. మరి సినిమాలకు దూరంగా ఉంటోన్న ఇలియానా మళ్లీ చేతి నిండా ఆఫర్లతో బిజీగా ఎప్పుడు మారుతుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

Also Read: Pawan-Harish Movie: పవన్‌ ఫ్యాన్స్‌ సిద్ధంగా ఉండండి.. హరీష్‌ శంకర్‌ సినిమా అప్‌డేట్‌ వస్తోంది. ఎప్పుడో తెలుసా.?

Pooja Hegde: మరో రెండు భారీ ఆఫర్లు కొట్టేసిన బుట్టబొమ్మ.. ఇద్దరు మెగా హీరోలతో నటించనున్న పూజా.?

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ను కంగారెత్తిస్తోన్న గేమ్‌.. పోలీసులను ఆశ్రయించిన కండల వీరుడు

Click on your DTH Provider to Add TV9 Telugu