Viral Photo: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి సెలబ్రిటీలకు, ఫ్యాన్స్‌కు మధ్య దూరం తగ్గిపోతోంది. ఒకప్పుడు అభిమాన తారలను టీవీల్లో చూసి మురిసిపోయే అభిమానులు ఇప్పుడు నేరుగా వారికి మెసేజ్‌లు చేయగలుగుతున్నారు. వారు చేసిన పోస్టులకు కామెంట్లు పెడుతున్నారు. చివరికి వారిని ప్రశ్నించగలుగుతున్నారు. ఇదంతా సోషల్ మీడియా పుణ్యామేనని చెప్పాలి. ఇక సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారుతున్నారు. ఎప్పటికప్పుడు తమ లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు.
View this post on Instagram
ఈ క్రమంలోనే కొన్ని వినూత్న రకాల ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌కు ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. తాజాగా అందాల తార అమలాపాల్ కూడా అలాంటి ఫోటోనే పోస్ట్ చేసింది. భుజాన బ్యాగ్ వేసుకొని వెళుతోన్న సమయంలో వెనకాల నుంచి తీసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందీ బ్యూటీ. అయితే ఇందులో ఉంది అమలా అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఐడీ చూసేంత వరకు గుర్తుపట్టలేనట్లు ఉంది. ఇదిలా ఉంటే ఈ ఫోటోతో పాటు అమలా పాల్ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చింది.. తాను ఎదుర్కొంటున్న భయాలకు లేఖను రాస్తున్నట్లు తెలిపిన అమలా.. ‘నేను నిన్ను చూస్తున్నాను, నేను నీ నుంచి నేర్చుకుంటున్నాను, నువ్వు నాకు ఇచ్చిన సలహాలకు ధన్యవాదాలు’ అంటూ ఆసక్తికర క్యాప్షన్ జోడించిందీ బ్యూటీ.
ఇక అమలా పాల్ కెరీర్ విషయానికొస్తే ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలు, మలయాళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తూ మెప్పిస్తోందీ చిన్నది.. ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ‘కుడిఎడమైతే’తో పాటు ‘పిట్ట కథలు’ వెబ్ సిరీస్‌లలో నటించి డిజిటల్ స్క్రీన్‌పై కూడా తళుక్కుమందీ బ్యూటీ.
View this post on Instagram
Indian Railways: వంద రూట్లలో ప్రైవేట్ రైళ్ళు.. టెండర్లను పిలిచేందుకు ప్రభుత్వ సన్నాహాలు!