ఆ ఇద్దరికీ ‘బాహుబలి’ ఇవ్వలేని గుర్తింపు ‘సైరా’ ఇచ్చిందా..!

చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ మెగాస్టార్ స్టామినాను చాటుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 100కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. శని, ఆది వారాలు వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అయితే బాహుబలి చిత్రంలో నటించిన పలువురు సైరాలో కూడా భాగమైన విషయం తెలిసిందే. బాహుబలిలో కనిపించిన తమన్నా, సుదీప్, నాజర్, అనుష్క, రోహిణిలు సైరాలో కనిపించారు. వీరిలో నాజర్, అనుష్కలు చిన్న […]

ఆ ఇద్దరికీ ‘బాహుబలి’ ఇవ్వలేని గుర్తింపు ‘సైరా’ ఇచ్చిందా..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 05, 2019 | 8:12 PM

చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ మెగాస్టార్ స్టామినాను చాటుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 100కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. శని, ఆది వారాలు వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. అయితే బాహుబలి చిత్రంలో నటించిన పలువురు సైరాలో కూడా భాగమైన విషయం తెలిసిందే. బాహుబలిలో కనిపించిన తమన్నా, సుదీప్, నాజర్, అనుష్క, రోహిణిలు సైరాలో కనిపించారు.

వీరిలో నాజర్, అనుష్కలు చిన్న పాత్రలకు మాత్రమే పరిమితం అయ్యారు. నాజర్.. చిరంజీవి తాతయ్య పాత్రలో కనిపించగా.. అనుష్క, ఝాన్సీ లక్ష్మీభాయిగా నటించారు. సినిమా మొత్తంలో వీరి పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. అయితే వీరిద్దరు బాహుబలి మొదటి, రెండు భాగాల్లో లెంగ్తీ కారెక్టర్లలో నటించారు. ఇక తమన్నా, సుదీప్‌ల విషయానికొస్తే.. సైరాలో ప్రధాన పాత్రాధారుల్లో వీరిద్దరు నటించారు. అవకు రాజుగా సుదీప్.. లక్ష్మీగా తమన్నా ముఖ్య పాత్రలలో కనిపించారు. అంతేకాదు సైరాలో చిరు తరువాత పేరు పొందిన వారిలో వీరిద్దరు ఉండటం మరో విశేషం. వీరిద్దరికి విమర్శకుల నుంచి కూడా ఎన్నో ప్రశంసలు వినిపించాయి.

అయితే బాహుబలి మొదటి భాగంలో సుదీప్ అస్లామ్ ఖాన్ అనే పాత్రలో కనిపించాడు. ఈ పాత్ర నిడివి చాలా తక్కువగానే ఉంటుంది. కానీ సైరాలో అవకు రాజు పాత్రలో డిఫరెంట్ యాంగిల్స్‌లో అదరగొట్టేశాడు సుదీప్. మరోవైపు బాహుబలిలో అవంతిక పాత్రలో కనిపించిన తమన్నా.. మొదటి భాగంలో కాసేపు ఎక్కువగానే ఉన్నప్పటికీ.. రెండో భాగంలో మాత్రం రెండు, మూడు సీన్లకు మాత్రమే పరిమితమైంది. దీనిపై అప్పట్లో చాలా కామెంట్లు కూడా వినిపించాయి. తమన్నాను గ్లామర్ షోకు మాత్రమే పరిమితం చేశారని.. రెండో భాగంలో అయితే ఆమెను కారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశారని కొంతమంది కామెంట్లు చేశారు. కానీ ఈ ఇద్దరికి ఇప్పుడు సైరాలో మంచి పాత్రలు దొరకడం విశేషం. ఇక ఆ పాత్రలు వారి వారి కెరీర్‌లో గుర్తుండిపోతాయి అనడంలో కూడా ఏ మాత్రం సందేహం ఉండదు. వీరితో పాటు బాహుబలిలో కనిపించిన సీనియర్ నటి రోహిణి సైరాలో ఓ కీలక పాత్రలో కనిపించారు. ఈ రెండు సినిమాల్లో ఆమె కీలక పాత్రల్లోనూ నటించడం గమనర్హం. మొత్తానికి బాహుబలి ద్వారా తమన్నా, సుదీప్‌లకు రాని పేరు సైరాతో వచ్చిందని మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu