సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు అనిల్ మురళీ కన్నుమూత

మ‌ల‌యాళం న‌టుడు అనిల్ ముర‌ళీ(56) క‌న్నుమూశారు. కాలేయానికి సంబంధించిన వ్యాధితో  కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

  • Tv9 Telugu
  • Publish Date - 2:25 pm, Thu, 30 July 20
సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు అనిల్ మురళీ కన్నుమూత

Anil Murali passed away: మ‌ల‌యాళం న‌టుడు అనిల్ ముర‌ళీ(56) క‌న్నుమూశారు. కాలేయానికి సంబంధించిన వ్యాధితో  కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అనిల్‌ మురళీకి భార్య సుమ, ఇద్ద‌రు పిల్ల‌లున్నారు. 1993లో ‘క‌న్యాకుమారియిల్ ఒరు క‌విత’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనిల్ మురళీ.. దక్షిణాది భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. రాక్ అండ్ రోల్‌, సిటీ ఆఫ్ గాడ్‌, బాడీగార్డ్, అవ‌తారం, ఉయ‌రే, బ్ర‌ద‌ర్స్ డే చిత్రాల్లోని పాత్ర‌లు ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులో రంగేలీ కాశీ, జెండాపై క‌పిరాజులో న‌టించిన అనిల్‌.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సీరియళ్లలో నటిస్తున్నారు. ‘ఆహా’ డిజిట‌ల్ డ‌యాస్ మీద శుక్ర‌వారం విడుద‌ల‌వుతోన్న ‘ఫొరోన్సిక్‌’ చిత్రం న‌టుడిగా ఆయ‌నకు ఆఖ‌రి చిత్రం. దిలీప్‌, న‌మితా ప్ర‌మోద్ న‌టించే ‘డింకిన్’ అనే చిత్రం ఇంకా సెట్స్ మీద ఉండగా.. ఈ చిత్రం కోసం ఆయన కొన్ని రోజులు ప‌నిచేశారు.

Read This Story Also: డాక్టర్‌పై మరణించిన కరోనా రోగి కుమారుడు కత్తి దాడి