Actress Mary: కరోనాతో కూలిపోయిన ఆశలు.. సినిమా ఛాన్సులు లేక రోడ్లపై లాటరీ టికెట్లు అమ్ముకుంటున్న నటి

ప్రేమమ్‌ హీరో నివిన్ పౌలీ హీరోగా 2016లో వచ్చిన యాక్షన్‌ హీరో బిజు సినిమాతో మంచి గుర్తింపు పొందిందీ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్‌. ఆతర్వాత పైపిన్ చువత్తిలే ప్రణయంతో మరో హిట్‌ ఖాతాలో వేసుకుంది. ఇలా నటిగా విలాసవంతమైన జీవితాన్ని చూసిన ఆమె ఇప్పుడు గత్యంతరం లేక రోడ్ల మీద లాటరీ టికెట్లు విక్రయిస్తోంది.

Actress Mary: కరోనాతో కూలిపోయిన ఆశలు.. సినిమా ఛాన్సులు లేక రోడ్లపై లాటరీ టికెట్లు అమ్ముకుంటున్న నటి
Actress Mary
Follow us

|

Updated on: Nov 10, 2022 | 6:41 AM

అందరి సినిమా తారల్లాగే ఆమెది కూడా లగ్జరీ లైఫ్‌ స్టైల్‌.. 35కు పైగా సినిమాల్లోనూ, వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. ఆ డబ్బుతోనే కూతురు పెళ్లి ఘనంగా చేసింది. పనిలో పనిగా బ్యాంకులోని తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంది. కానీ అనుకోని అతిథిలా వచ్చిన కరోనా మహమ్మారి ఆ తార జీవితాన్ని తలకిందులు చేసింది. సినిమా ఛాన్సులు కరువయ్యాయి. జీవనోపాధి భారమైంది. పూటగడవడమే కష్టంగా మారిపోయింది. ఏం చేయాలో తెలియక రోడ్డు మీద లాటరీ టికెట్లు విక్రయిస్తోంది. ఆమె ప్రముఖ మలయాళ నటి మేరీ. ప్రేమమ్‌ హీరో నివిన్ పౌలీ హీరోగా 2016లో వచ్చిన యాక్షన్‌ హీరో బిజు సినిమాతో మంచి గుర్తింపు పొందిందీ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్‌. ఆతర్వాత పైపిన్ చువత్తిలే ప్రణయంతో మరో హిట్‌ ఖాతాలో వేసుకుంది. ఇలా నటిగా విలాసవంతమైన జీవితాన్ని చూసిన ఆమె ఇప్పుడు కరోనా తో గత్యంతరం లేక రోడ్ల మీద లాటరీ టికెట్లు విక్రయిస్తోంది. అలప్పుజాలోని ఎరమల్లూర్‌లో నివాసముంటోన్న ఆమె ఉదయం ఆరున్నర గంటలకు బయటకు వెళ్లి ఏ సాయంత్రానికో ఇల్లు చేరుకుంటోంది. లాటరీ టికెట్ల అమ్మకం ద్వారా రోజుకి రూ.300 సంపాదిస్తోంది.

35 సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించిన మేరీ ఆ డబ్బుతో తన కూతురు పెళ్లి ఘనంగా చేసింది. సినిమా ఆఫర్లు వస్తుండటంతో మేరీ వాటిని తీర్చగలననే ఆశతో అప్పు చేసి ఇల్లు కట్టుకుంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి ఆమె జీవితాన్ని అతలాకుతలం చేసింది. సినిమా ఆఫర్లు కరువయ్యాయి. దీంతో మేరీ తన కుటుంబాన్ని చూసుకోవడానికి, బ్యాంకు రుణాన్ని చెల్లించడానికి చిన్నా చితకా ఉద్యోగాలు చేయవలసి వచ్చింది. కాగా మేరీ కుమారుడు కూడా ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నాడు. అతని వైద్య ఖర్చులు భరించాలన్నా, కుటుంబానికి గడవాలన్నా, తీసుకున్న బ్యాంకు అప్పు తీర్చాలన్నా ఏదో ఒక పని చేయక తప్పట్లేదామెకు. అందుకోసం రోడ్డుపై లాటరీ టికెట్లు అమ్ముతూ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో కుటుంబాన్ని నడిపిస్తోంది. కాగా ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మేరీ సినిమాలపై తన అభిరుచిని వదులుకోలేదు. ఎప్పటికైనా సినిమా నిర్మాతలు తనను పిలుస్తారనే ఆశతో మేరీ ప్రతిరోజూ లాటరీ అమ్మడానికి బయలుదేరుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
ఇదో వింత ఆచారం... పూజారి కాలితో తంతే మోక్షం కలుగుతుందట..
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారి ఎప్పుడు ఎలా ఉందో తెలుసా.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!