ఆచార్యలోకి ‘సోనూసూద్‌’ ఎంట్రీ.. సత్కరించిన కొరటాల, తనికెళ్ల భరణి

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ తిరిగి ప్రారంభం అయ్యింది

  • Tv9 Telugu
  • Publish Date - 2:50 pm, Sat, 21 November 20
ఆచార్యలోకి 'సోనూసూద్‌' ఎంట్రీ.. సత్కరించిన కొరటాల, తనికెళ్ల భరణి

Sonu Sood Acharya: మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఆచార్య. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ తిరిగి ప్రారంభం అయ్యింది. హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్‌లో ఈ మూవీ షూటింగ్‌ని కానిచ్చేస్తున్నారు దర్శకుడు కొరటాల. కాగా ఈ మూవీలో సోనూసూద్‌ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆచార్య సెట్స్‌లోకి సోనూసూద్‌ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా సాదరంగా అతడిని ఆహ్వానించింది టీమ్‌. దర్శకుడు కొరటాల శివ, నటుడు తనికెళ్ల భరణి సోనూకు స్వాగతం పలికారు. కాగా లాక్‌డౌన్‌ వేళ లక్షలాదిమంది వలసకార్మికులు, విద్యార్థులను సోనూసూద్‌ ఆదుకున్నారు. ఈ క్రమంలో అతడి సేవలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మక అవార్డును కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సోనూకు సన్మానం చేసినట్లు తెలుస్తోంది. (‘ఇంటర్నేషనల్‌ మెన్స్‌డే’ సెలబ్రేషన్‌లో టాలీవుడ్‌ దర్శకులు.. పార్టీ ఇచ్చిన తరుణ్ భాస్కర్‌)

కాగా సామాజిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ రెండోసారి జతకడుతున్నారు. రామ్ చరణ్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సోనూసూద్‌, అజయ్‌, హిమజ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. (ఒక్క రోజు పోలీస్‌ స్టేషన్‌ ఇంఛార్జ్‌గా బాలిక.. కాన్పూర్‌ పోలీసుల అభినందన చర్య)