Samantha: పుష్పలో స్పెషల్ సాంగ్‌లో కనిపించి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది అందాల తార సమంత. పుష్ప సినిమా నేషనల్ వైడ్‌గా విడుదల కావడం, విడుదలైన అన్ని చోట్లా భారీ విజయాన్ని అందుకోవడంతో సమంత పేరు ఒక్కసారిగా మోరుమోగింది. కెరీర్లో తొలిసారి స్పెషల్ సాంగ్‌లో నటించిన సామ్ తొలి పాటతోనే అలజడి సృష్టించింది. ఇదిలా ఉంటే సమంత మరోసారి ఐటెంసాంగ్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శకత్వంలో బాలీవుడ్లో యానిమల్ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.
రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. హిందీతో పాటు సౌత్‌లోని అన్ని భాషల్లో విడులవుతోన్న ఈ సినిమాలో దర్శకుడు ప్రత్యేకంగా ఓ స్పెషల్ సాంగ్‌ను డిజైన్ చేస్తున్నాడు. సినిమాకే హైలెట్‌గా నిలిచే ఈ పాట కోసం సందీప్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఈ సాంగ్‌కు పూజా హెగ్డేను తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం పూజా ప్లేస్‌ను సమంత రీప్లెస్ చేసిటన్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ సమంతను సంప్రదించగా సామ్ సానూకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..