Bharateeyudu: భారతీయుడు 2 నుంచి తప్పుకున్న కాజల్‌.? చందమామను రీప్లేస్‌ చేయనున్న చెన్నై సుందరి..

Bharateeyudu 2: శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ హీరోగా 1996లో వచ్చిన 'భారతీయుడు' సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్‌..

Bharateeyudu: భారతీయుడు 2 నుంచి తప్పుకున్న కాజల్‌.? చందమామను రీప్లేస్‌ చేయనున్న చెన్నై సుందరి..
Kajal
Follow us

|

Updated on: Nov 15, 2021 | 12:38 PM

Bharateeyudu 2: శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ హీరోగా 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెను సంచలనాన్ని సృష్టించింది. ఇదిలా ఉంటే ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించే పనిలో పడ్డారు శంకర్‌. ఈ క్రమంలోనే షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ఏ సమయంలో ఈ సినిమాను ప్రారంభించారో కానీ.. అన్ని అడ్డంకులే వస్తున్నాయి. సినిమా షూటింగులో అగ్నిప్రమాదం జరిగి కొందరు యూనిట్ సభ్యులు మరణించడం.. ఆ తర్వాత కొవిడ్ వ్యాప్తి.. దాని తర్వాత నిర్మాతలకు, దర్శకుడికి మనస్పర్థలు రావడం.. హైకోర్టు మెట్లెక్కడంతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది.

అయితే ప్రస్తుతం సమస్యలన్నీ తొలగిపోయి చిత్రీకరణ ప్రారంభమవుతుందని అనుకుంటోన్న సమయంలో.. తాజాగా ఈ సినిమాకు కాజల్‌ రూపంలో మరో అడ్డంకి ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. కాజల్‌ డేట్స్‌ను అడ్జస్ట్ చేయలేక ఈ సినిమా నుంచి తప్పుకోనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కాజల్‌ గర్భవతి కావడం వల్లే ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. అయితే దీనిపై చందమామ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన తమిళ కమెడియన్‌ వివేక్‌ కూడా ఈ ఏడాది మరణించిన విషయం తెలిసిందే.

దీంతో అటు కాజల్‌ పాత్రను, ఇటు వివేక్‌ పాత్రలను మళ్లీ రీషూట్‌ చేయాలని శంకర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాజల్‌ స్థానంలో చెన్నై ముద్దుగుమ్మ త్రిషను తీసుకోనున్నట్లు ప్రస్తుతం చెన్నై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇక కాజల్‌ తల్లి కాబోతున్నట్లు వస్తోన్న వార్తలకు కూడా ఇది బలం చేకూర్చినట్లయింది.

Also Read: Mysterious Tree: 1,400 ఏళ్లనాటి వృక్షం.. ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం

Chiranjeevi: మెగాస్టార్‌ ‘భోళాశంకర్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం.. ఫొటోలు షేర్‌ చేసిన డైరెక్టర్‌..

Cabinet Groups: సీనియర్ మంత్రుల నేతృత్వంలో గ్రూపులుగా కేంద్ర మంత్రులు.. ప్రధాని మోడీ కీలక నిర్ణయం.. ఎందుకంటే..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?