Breaking News
  • అమరావతి. రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటు, ఎరువుల హోం డెలివరీ ప్రక్రియ ప్రారంభం. ఆర్‌బీకేల నుంచి ఎరువుల సరఫరాకు సంబంధించి రైతులకు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) వర్షన్‌, ఎస్‌ఎంఎస్‌ సర్వీసును ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ సమక్షంలో ప్రారంభించిన కేంద్ర మంత్రులు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ, ఆ శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా. క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు.
  • తిరుమల: టీటీడీకి రూ.కోటి విరాళం. ఎస్వీబీసీకి రూ.కోటి విరాళంగా ఇచ్చిన చైన్నైకు చెందిన కామాక్షి శంకర్. టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మారెడ్డికి చెక్కు అందజేత. ఎస్వీబీసీని యాడ్ ఫ్రీ చేయడంతో భక్తుల నుండి పెరుగుతున్న విరాళాలు. మూడు నెలల్లో రూ.6 కోట్లు దాటిన విరాళాలు.
  • విజయవాడ : ఆర్కియాలజి కమిషనర్ వాని మోహన్ కామెంట్స్ అక్టోబర్ ఒకటో వ తేదీన బాపు మ్యూజియం ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. గత పదేళ్లుగా ముత పడిన మ్యూజియం రేపటి నుంచి పర్యాటకలకు అందుబాటులో కి రానుంది. ఏళ్ల తరబడి పొందుపరిచిన శిల్పాలు, రాతి కట్టుబడులు మ్యూజియం లో ఉన్నాయ్. బాపు మ్యూజియం లో ఇంటరాక్టివ్ కియోస్క్ ను అధునాతన టెక్నాలజీ తో అభివృద్ధి.
  • వైద్య, ఆరోగ్యశాఖ ఆస్పత్రులలో నాడు–నేడు పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష: నాడు–నేడు కార్యక్రమంలో ఆస్పత్రులలో చేపడుతున్న మార్పులతో పాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల ప్రస్తుత పరిస్థితిని వివరించిన అధికారులు. పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో వైద్య కళాళాలలకు సంబంధించి భూసేకరణతో పాటు, అవసరమైన అన్ని పనులు పూర్తయ్యాయని, టెండర్ల ఖరారుకు జ్యుడీషియల్‌ రివ్యూకు పంపిస్తున్నామని తెలిపిన అధికారులు.
  • సిఎం వైఎస్ జగన్ కామెంట్స్: అన్ని ఆస్పత్రులలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలి. వాటి నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అక్కడ కార్పొరేట్‌ లుక్‌ కనిపించాలి. చరిత్రలో నిల్చిపోయే విధంగా వాటి నిర్మాణం జరగాలి. మూడేళ్లలో అన్ని ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి కావాలి. ఆ ఆస్పత్రులలో యంత్రాలు, ఏసీలు, లిఫ్ట్‌లు, ఎలక్ట్రికల్, నాన్‌ ఎలక్ట్రికల్‌ ఉపకరణాలు, ఫైర్‌ కంట్రోల్‌ ఎక్విప్‌మెంట్‌ వంటి అన్నింటి నిర్వహణ బాధ్యత ఏడేళ్ల పాటు అప్పగించాలి. తద్వారా ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కారం అవుతుంది. ఆస్పత్రిలో ఓనర్‌షిప్‌ తీసుకోవాలి. తప్పనిసరిగా సెంట్రలైజ్డ్‌ ఏసీ ఉండాలి, డాక్టర్లు ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడే వారు చక్కగా సేవలందించగలుగుతారు. అవసరం అయితే సౌర విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం, దాని వల్ల యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.2.50 కే వస్తుంది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయి. అందువల్ల ప్రతి ఆస్పత్రి బెస్టుగా ఉండాలి.
  • చెన్నై హిందూ మున్నని సంస్థ వ్యవస్థాపకుడు రామగోపాలన్ ( 94 ) మృతి . కరోనా మహమ్మారి కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి . 1980 లో హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ మున్నని అనే సంస్థను ఏర్పాటు చేసిన రామగోపాలన్. హిందూ ధర్మ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు ఉద్యమాలను నడిపించిన రామగోపాలన్ . హిందూ మున్నని సంస్థ వ్యవస్థాపకుడు రామగోపాలన్ మృతి సంతాపం తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు .

ఏపీ నెత్తిన ఆంగ్లం బండ.. సర్కారీ ఉత్తర్వుల సారాంశమేంటంటే ?

english language must in ap, ఏపీ నెత్తిన ఆంగ్లం బండ.. సర్కారీ ఉత్తర్వుల సారాంశమేంటంటే ?
ఆంధ్రప్రదేశా లేక ఆంగ్ల ప్రదేశా.. ఈ ప్రశ్న తాజాగా ఏపీని కుదిపేయడం మొదలు పెట్టింది. పదో తరగతి వరకు ఇంగ్లీష్ భాష కంపల్సరీ అంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏపీలో దుమారానికి తెరలేపాయి. తెలుగు, ఉర్దూ మీడియం పాఠశాలలను ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌గా మారుస్తామన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంతో మాతృభాషలను చంపేస్తున్నారని భాషాభిమానులు ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం- ఆంగ్ల పాఠశాలలవైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారని కౌంటర్‌ ఇస్తోంది. సర్కారీ బడులు- ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌గా మారితే లాభమా, నష్టమా ఈ ప్రశ్న ఇపుడు ఏపీ రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాన్య ప్రజానీకంలో మొదలైంది. 
ప్రభుత్వ పాఠశాల్ని ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌ మార్చాలన్న అంశంపై అక్టోబర్ నెల 29వ తేదీన ప్రొఫెసర్‌ కె.బాలకృష్ణన్‌, సుధా నారాయణమూర్తి తదితర విద్యావేత్తల కమిటీతో ఏపీ సీఎం జగన్‌ సుదీర్ఘంగా చర్చించారు. దీనికి సంబంధించి ఈనెల 5వ తేదీన జీవో నెంబర్‌ 81ని జారీచేసి- కార్యాచారణ ప్రణాళిక ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. సర్కారీ ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లలో దశలవారీగా రాష్ట్ర ప్రభుత్వ సిలబస్‌కి బదులు CBSE సిలబస్‌ను ప్రవేశపెడతారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ఉంటుంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి తొమ్మిది, పదో తరగతుల్లో ఇంగ్లీష్‌ మీడియం అందుబాటులో ఉంటుంది. ఈ జీవోపై విమర్శలు వస్తున్నాయి. 81వ జీవో చారిత్రక తప్పిదమనీ, మాతృభాషను మృతభాషగా చేయడమేనని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. పలు తెలుగు భాషా సంఘాలు ప్రభుత్వ చర్యను తప్పు పడుతున్నాయి. ఈ చర్య ద్వారా పిల్లల్లో తెలుగు నేర్చుకోవాలన్న కోరిక చచ్చిపోతుందని, భావితరాలకు తెలుగు భాష రాని దుస్థితి ఏర్పడుతుందని ఈ సంఘాలు వాదిస్తున్నాయి.
కానీ మారుతున్న స్థితిగతులకు అనుగుణంగా యువతలో భాషా పరిఙ్ఞానాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. తెలుగు భాష పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటూనే ఆంగ్ల భాషా పరిఙ్ఞానాన్ని పెంపొందించడం ద్వారా బెటర్ ఉద్యోగావకాశాలు యువతకు అందేలా చూడాన్నదే తమ అభిమతమని ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు అంటున్నారు.
మరోవైపు టిడిపి జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి నారాలోకేశ్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుపట్టారు. ”తెలుగు’లెస్సేనా’, ఎందుకింత తెగులు..?”,”ఏకపక్ష నిర్ణయం..,విద్యకు దూరమయ్యే ప్రమాదం”, ”మాతృభాషపై అంత అక్కసు ఎందుకో” ”డ్రాప్‌ అవుట్స్‌ పెరుగుతాయి, విద్యార్థులకు నష్టమే” ఇవన్నీ నేను ఇప్పుడు అంటున్నవి కావు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం నగరపాలక పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలి… అది కూడా విద్యార్థులకు ఇష్టమైతేనే.. అని నిర్ణయం తీసుకున్నపుడు వైసీపీ నాయకుల కూతలు ఇవి.. అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు నారా లోకేశ్.  
english language must in ap, ఏపీ నెత్తిన ఆంగ్లం బండ.. సర్కారీ ఉత్తర్వుల సారాంశమేంటంటే ?
ప్రభుత్వ తొందరపాటు చర్యల వలన  తల్లిదండ్రులు, పిల్లలు ఆందోళనకు గురవుతున్నారని, ప్రభుత్వం హడావిడి గా ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చెయ్యాలని టిడపి నేతలు కోరుతున్నారు.

Related Tags