ఐసీసీ ప్రపంచకప్ 2019: తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం

ఐసీసీ ప్రపంచకప్ 2019 లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 312 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీ జట్టు 207 పరుగులకే ఆలౌటై… 104 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఇంగ్లండ్ జట్టులో ఏకంగా నలుగురు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు చేశారు. ఓపెనర్ జాసన్ రాయ్ 54, జో రూట్ 51, ఇయాన్ మోర్గాన్ 57 పరుగులు చేయగా, బెన్ స్టోక్స్ 89 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 18, మొయిన్ అలీ 3, క్రిస్ వోక్స్ 13, లియాం ప్లంకెట్ 9(నాటౌట్), జోఫ్రా అర్చర్ 7(నాటౌట్) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీసుకోగా, ఇమ్రాన్ తాహిర్, రబడ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. పెహ్లుక్వాయో ఓ వికెట్ తీసుకున్నాడు. అనంతరం 312 పరుగుల భారీ విజయ లక్ష్యంలో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *