యాషెస్‌ సిరీస్‌లో స్టువార్ట్‌ బ్రాడ్‌ రికార్డు

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువార్ట్‌ బ్రాడ్‌ చెలరేగాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లను కకావికలం చేయడంతో పాటు ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. స్టీవ్‌స్మిత్‌(144)ను ఔట్‌ చేయడం ద్వారా యాషెస్‌లో వంద వికెట్లు తీసిన 19వ ఆటగాడిగా బ్రాడ్‌ రికార్డు సృష్టించాడు. డేవిడ్‌వార్నర్‌, కామెరన్‌ బెన్‌క్రాఫ్ట్‌, స్టీవ్‌స్మిత్‌, టిమ్‌పైన్‌, జేమ్స్‌ పాటిన్‌సన్‌లను బ్రాడ్‌ పెవిలియన్‌ చేర్చాడు. కాగా… బ్రాడ్‌ మరో ఘనతకు కూడా చేరువలో ఉన్నాడు. టెస్టుల్లో ప్రస్తుతానికి 449 వికెట్లు తీసిన […]

యాషెస్‌ సిరీస్‌లో స్టువార్ట్‌ బ్రాడ్‌ రికార్డు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 02, 2019 | 8:07 PM

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువార్ట్‌ బ్రాడ్‌ చెలరేగాడు. నిప్పులు చెరిగే బంతులతో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లను కకావికలం చేయడంతో పాటు ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. స్టీవ్‌స్మిత్‌(144)ను ఔట్‌ చేయడం ద్వారా యాషెస్‌లో వంద వికెట్లు తీసిన 19వ ఆటగాడిగా బ్రాడ్‌ రికార్డు సృష్టించాడు. డేవిడ్‌వార్నర్‌, కామెరన్‌ బెన్‌క్రాఫ్ట్‌, స్టీవ్‌స్మిత్‌, టిమ్‌పైన్‌, జేమ్స్‌ పాటిన్‌సన్‌లను బ్రాడ్‌ పెవిలియన్‌ చేర్చాడు.

కాగా… బ్రాడ్‌ మరో ఘనతకు కూడా చేరువలో ఉన్నాడు. టెస్టుల్లో ప్రస్తుతానికి 449 వికెట్లు తీసిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో ఇంకో వికెట్‌ తీస్తే.. 450 వికెట్ల మార్కును చేరుకుంటాడు. ఆసీస్‌ మాజీ బౌలర్‌ షేన్‌వార్న్‌ యాషెస్‌లో అత్యధికంగా 195 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌(104) వికెట్లతో కొనసాగుతున్నాడు.