వరల్డ్‌కప్‌లో వరుస రికార్డులు.. క్రికెట్ చరిత్రలో సంచలనాలు!

ప్రపంచకప్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్ 150 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (71 బంతుల్లో 148; 4 ఫోర్లు, 17 సిక్సర్లు) ఆఫ్ఘన్ బౌలర్లకు విశ్వరూపం చూపించడంతో ఇంగ్లాండ్ నిర్ణేత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 397 పరుగులు చేసింది. ఇకపోతే మోర్గాన్ కేవలం సిక్సర్ల రూపంలో ఏకంగా 102 పరుగులు రాబట్టడం విశేషం. అతని దెబ్బకు.. ఆఫ్ఘన్ […]

వరల్డ్‌కప్‌లో వరుస రికార్డులు.. క్రికెట్ చరిత్రలో సంచలనాలు!
Follow us

|

Updated on: Jun 19, 2019 | 4:27 PM

ప్రపంచకప్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిధ్య ఇంగ్లాండ్ 150 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (71 బంతుల్లో 148; 4 ఫోర్లు, 17 సిక్సర్లు) ఆఫ్ఘన్ బౌలర్లకు విశ్వరూపం చూపించడంతో ఇంగ్లాండ్ నిర్ణేత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 397 పరుగులు చేసింది. ఇకపోతే మోర్గాన్ కేవలం సిక్సర్ల రూపంలో ఏకంగా 102 పరుగులు రాబట్టడం విశేషం. అతని దెబ్బకు.. ఆఫ్ఘన్ సంచలనం రషీద్ ఖాన్ బౌలింగ్‌లో(0/110 9 ఓవర్లకు) సెంచరీ కూడా చేశాడు. దీంతో ఈ మిస్టరీ స్పిన్నర్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్థాన్ 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 247 పరుగులు మాత్రమే చేయగలిగింది. తుఫాన్ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డ మోర్గాన్‌కు ‘మ్యాన్ అఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక ఈ మ్యాచ్‌లో పలు అంతర్జాతీయ రికార్డులను ఇంగ్లాండ్, మోర్గాన్ బ్రేక్ చేశారు. ఒకే మ్యాచ్‌లో 17 సిక్సర్లు కొట్టి మోర్గాన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

ఒకసారి ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు పరిశీలిస్తే…

  • ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్ల(17) రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఇయాన్ మోర్గాన్. వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్(16 సిక్సర్ల)తో రెండో స్థానంలో ఉన్నాడు
  • వరల్డ్ కప్లో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్ ఇదే – 33 సిక్సర్లు
  • వన్డే క్రికెట్ చరిత్రలో.. ఒకే మ్యాచ్‌లో 17 సిక్సర్లు కొట్టి ఇయాన్ మోర్గాన్ చరిత్ర సృష్టించాడు. దీనితో రోహిత్ శర్మ, డివిలియర్స్, క్రిస్ గేల్ పేరిట సంయుక్తంగా ఉన్న 16 సిక్సర్ల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
  •  ప్రపంచకప్ చరిత్రలో మోర్గాన్ నాలుగో ఫాస్టెస్ట్(57 బంతుల్లో) సెంచరీ పూర్తి చేశాడు. కెవిన్ ఓబ్రయన్ (50 బంతుల్లో) అగ్రస్థానంలో ఉండగా.. మ్యాక్స్‌వెల్ (51 బంతుల్లో), డివిలియర్స్ (52 బంతుల్లో) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 
  • వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారి జాబితాలో మోర్గాన్(211) ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. అఫ్రిది (పాకిస్థాన్; 351), గేల్ (వెస్టిండీస్; 318), జయసూర్య (శ్రీలంక; 270), ధోనీ (225), రోహిత్ (224) తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.
  • కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కొట్టిన మొత్తం సిక్సర్ల సంఖ్య 25. ఓ వన్డే మ్యాచ్‌లో ఇవే అత్యధికం.. గతంలో విండీస్‌పై 24 సిక్సర్లు‌తో తమ పేరిట ఉన్న రికార్డు‌ను చెరిపేసుకుంది.
  • అంతర్జాతీయ వన్డేల్లో.. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు(11) సమర్పించిన బౌలర్‌గా రషీద్ ఖాన్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
  • ఈ మ్యాచ్‌లో ఒక్క రషీద్ ఖాన్ బౌలింగ్‌లోనే మోర్గాన్ 7 సిక్సర్లు కొట్టాడు. వన్డేల్లో ఒక బౌలర్, ఒక బ్యాట్స్‌మెన్‌కు ఇచ్చుకున్న అత్యధిక సిక్సర్లు ఇవే. ఇక గతంలో డివిలియర్స్.. హోల్డర్ బౌలింగ్‌లో రెండుసార్లు ఆరేసి సిక్సర్లు బాదాడు.
  • 397/6.. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌కు ఇదే అత్యధిక స్కోర్. ఇక ఈ వరల్డ్‌కప్‌లో ఇదే టాప్ స్కోర్ కాగా.. ఓవరాల్ ప్రపంచకప్‌లలో ఇది ఆరో అత్యధికం.
  • 0/110.. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ సంచలనం రషీద్ ఖాన్ నమోదు చేసిన గణాంకాలు ఇవి. వరల్డ్‌కప్‌లో ఓ బౌలర్ చేసిన అత్యంత చెత్త ప్రదర్శన ఇది. గతంలో న్యూజిలాండ్ ప్లేయర్ మార్టీన్ స్నెడెన్ (0/105; 1983 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై 12 ఓవర్లలో) పేరిట ఉన్న రికార్డు దీనితో తుడిచి పెట్టుకుపోయింది.