ధోనీ గేమ్ ప్లాన్ వల్లే ఓడామా ? సంజయ్, గంగూలీ నిప్పులు

వరల్డ్ కప్ లో ఆదివారం ఇంగ్లాండ్ జట్టు కోహ్లీ సేనను ఓడించడంపై నెటిజన్లు, క్రికెట్ ప్రియులతో బాటు క్రికెట్ దిగ్గజాలు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. కేవలం ఐదు వికెట్లే కోల్పోయి మిడిల్ లో ధోనీ ఉండగా.. ఇంగ్లాండ్ పై సునాయాసంగా నెగ్గే ఛాన్స్ ఉన్నప్పటికీ…ధోనీ గేమ్ ప్లాన్ కారణంగా టీమిండియా పెవిలియన్ బాట పట్టడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో… ఇద్దరు మాజీ క్రికెటర్లు.. సంజయ్ మంజ్రేకర్, సౌరవ్ గంగూలీ… ధోనీ స్ట్రాటిజీ ని ప్రశ్నించారు. […]

ధోనీ గేమ్ ప్లాన్ వల్లే ఓడామా ? సంజయ్, గంగూలీ నిప్పులు
Follow us

|

Updated on: Jul 01, 2019 | 7:30 PM

వరల్డ్ కప్ లో ఆదివారం ఇంగ్లాండ్ జట్టు కోహ్లీ సేనను ఓడించడంపై నెటిజన్లు, క్రికెట్ ప్రియులతో బాటు క్రికెట్ దిగ్గజాలు కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు. కేవలం ఐదు వికెట్లే కోల్పోయి మిడిల్ లో ధోనీ ఉండగా.. ఇంగ్లాండ్ పై సునాయాసంగా నెగ్గే ఛాన్స్ ఉన్నప్పటికీ…ధోనీ గేమ్ ప్లాన్ కారణంగా టీమిండియా పెవిలియన్ బాట పట్టడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో… ఇద్దరు మాజీ క్రికెటర్లు.. సంజయ్ మంజ్రేకర్, సౌరవ్ గంగూలీ… ధోనీ స్ట్రాటిజీ ని ప్రశ్నించారు. ఐసీసీ కామెంటేటర్స్ అయిన వీళ్ళు… పిచ్ లో బంతి వెనుక ధోనీ పరుగెత్తకపోవడమేమిటని అంటున్నారు. ఒకవేళ ధోనీ అలా చేసి ఉంటే మ్యాచ్ ఫలితం ఇండియాకు అనుకూలంగా ఉండి ఉండేదేమో అని అభిప్రాయపడ్డారు.

మ్యాచ్ అనంతరం లైవ్ గా జరిగిన చర్చల్లో పాల్గొన్న గంగూలీ… తన సందేహాలను బయట పెట్టడంలో ఏ మాత్రం సంకోచించలేదు. చేతిలో 5 వికెట్లు ఉన్నప్పుడు ఒక ప్లేయర్ ఇలా ఆడడం సమంజసమా ? నువ్వు గెలిచినా, ఓడినా సరే ! బంతి వెనుక పరుగు తీయాల్సి ఉంది. సమయాన్ని బట్టి ధోనీ అలా రిస్క్ తీసుకుని ఉంటే సముచితంగా ఉండేది.. చివరి ఆరు ఓవర్లలో ఒక్కో ఓవర్ కి 10 నుంచి 12 పరుగులు తీయాల్సి ఉన్నా సరిపోయేది’ అన్నాడు. ఇంతే కాదు..ధోనీని ఉద్దేశించి.’.నీకు ఎంతో అనుభవం ఉన్నప్పటికీ నేర్చుకోవలసిన అవసరం కూడా అంతే ఉంది .గేమ్ రిక్వైర్ మెంట్స్ ని ఎడాప్ట్ చేసుకోవాల్సి ఉంది ‘ అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.అంటే ఆటకు అవసరమైన మెళకువలను పాటించాల్సి ఉంది .. అన్నాడు. ఇలాగే మ్యాచ్ తరువాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సందర్భంగా సంజయ్ మంజ్రేకర్ కూడా ధోనీ గేమ్ ప్లాన్ గురించి ప్రస్తావించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి, ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ కి నేరుగా ప్రశ్నలు సంధించాడు. ఇలాగే ఇంకా పలువురు ధోనీ ఆట తీరును ప్రశ్నిస్తూ ట్వీట్లు చేశారు. కానీ.విరాట్ కోహ్లీ మాత్రం ..ధోనీ తప్పేమీ లేదన్నట్టు తటస్థంగా మాట్లాడాడు. .