కేంద్ర బడ్జెట్‌లో కీలకాంశాలు ఇవే

ఏటా లక్షల కోట్ల బడ్జెట్..అంతా ప్రజల కోసమే. సామాన్యుడి కష్టాలు తీర్చేందుకే…మధ్య తరగతి వర్గం బతుకును బాగు చేసేందుకే. కానీ ఆ లక్ష్యాలు సామాన్యుడి వరకు చేరడం లేదు. ఆ హామీలు..మధ్య తరగతి జీవుల కష్టాలను తీర్చడం లేదు. కొన్ని హామీలు పేపర్లకే పరిమితమైతే..మరికొన్ని పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఎక్కడ తేడా కొడుతోంది…పాలకుల హామీల్లోనా…? బడ్జెట్‌ రూపకల్పనలోనా…? 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ఆర్ధిక స్థితినే మార్చివేశాయి. బడ్జెట్‌తో […]

కేంద్ర బడ్జెట్‌లో కీలకాంశాలు ఇవే
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 01, 2020 | 9:09 AM

ఏటా లక్షల కోట్ల బడ్జెట్..అంతా ప్రజల కోసమే. సామాన్యుడి కష్టాలు తీర్చేందుకే…మధ్య తరగతి వర్గం బతుకును బాగు చేసేందుకే. కానీ ఆ లక్ష్యాలు సామాన్యుడి వరకు చేరడం లేదు. ఆ హామీలు..మధ్య తరగతి జీవుల కష్టాలను తీర్చడం లేదు. కొన్ని హామీలు పేపర్లకే పరిమితమైతే..మరికొన్ని పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఎక్కడ తేడా కొడుతోంది…పాలకుల హామీల్లోనా…? బడ్జెట్‌ రూపకల్పనలోనా…? 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ఆర్ధిక స్థితినే మార్చివేశాయి.

బడ్జెట్‌తో సంబంధం లేకుండా…అన్ని రంగాల్లో పీవీ లెక్కలే..పక్కా అని తేల్చాయి. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయలేదు.. బడ్జెట్‌ను ఘనంగా ప్రకటిస్తున్నా..లెక్కలు అమోఘంగా ఉన్నా అమలు మాత్రం అధ్వాన్నంగా ఉంటోంది…నరేంద్రమోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్‌ ఇదే! గత ఏడాది బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా అది ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ మాత్రమే.. ప్రస్తుతం ఆర్ధికరంగం మందగమనంలో పయనిస్తోంది.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో దేశ ఆర్ధిక వ్యవస్థ ఉంది.. దీనిని గాడిన పెట్టడమే నరేంద్రమోదీ సర్కారు ముందున్న అతి పెద్ద సవాలు..

ఆర్ధిక పరిస్థితి ఈ దశకు రావడానికి కారణం ప్రభుత్వం తీసుకున్న కొన్ని విధానాలే కారణమంటున్నారు ఆర్ధిక నిపుణులు. అందులో మొదటిది 2019లో తగ్గించిన కార్పొరేషన్‌ పన్ను.. దాని తగ్గింపు భారం తడిసి మోపడయ్యింది.. అది ఖజానాపై ఎంత ప్రభావం చూపించిందంటే 2.9 లక్షల కోట్ల రూపాయల భారం పడింది… ఇది కేంద్ర బడ్జెట్‌లో పది శాతం కంటే ఎక్కువ. అంతేకాదు దశలవారీగా జీఎస్టీ రేటును తగ్గించుకుంటూ రావడం కూడా ప్రతికూలత చూపించింది. గత ఏడాది చాలా వస్తువులపై జీఎస్టీ రేటును తగ్గించడమే కాకుండా …అనేక వస్తువులను అధిక జీఎస్టీ స్లాబుల నుంచి తక్కువ జీఎస్టీ స్లాబ్స్ కు తీసుకువచ్చింది.

ఒకవైపు కార్పొరేట్ పన్ను మినహాయింపు.. మరోవైపు జీఎస్టీ తగ్గింపులకు తోడుగా ఆర్ధికరంగం మందకొడిగా సాగుతుండటం వల్ల వసూళ్లు తగ్గాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయి. ఇది ఇప్పటికే దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రభుత్వ లక్ష్యాలు చేరుకునే అవకాశమే లేదని నిపుణులు అంటున్నారు. అదేవిధంగా, 50 వేల కోట్ల ఎగుమతి పథకం వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతుంది.

ఈ 50 వేల కోట్ల ఎగుమతి ఎం.ఐ.ఐ.ఎస్ స్కీమ్‌ను భర్తీ చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇది కూడా అనుకున్నంత సులభం కాదని తెలుస్తోంది. అలాగే ఇప్పటికే నిలిచిపోయిన గృహనిర్మాణ ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి ప్రతిపాదించిన 25 వేల కోట్ల రూపాయల నిధికి 10 వేల కోట్ల రూపాయల వరకు సహకారం అందిస్తామని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకేసారి పదివేలు అందించడం కష్టమే..ఇది కూడా పలు దఫాలుగా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. మోదీ సర్కార్‌ మొదటిసారి తీసుకొచ్చిన జీఎస్టీపై..మొత్తం అధికారం కేంద్రానికే ఉండేలా చేసింది. ఆయా రాష్ట్ర అసెంబ్లీలకున్న అధికారాన్ని తీసివేసింది. ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్‌లన్నీ పార్లమెంట్‌ పరిధిలోకి తెచ్చింది. ఇది కూడా రాష్ట్రాల ఆదాయాలపై ప్రభావం చూపింది.

ప్రస్తుతం కేంద్రం సరికొత్త పన్నుల విధానాన్ని తెచ్చేందుకు ఓ కమిటీని నియమించింది. సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ మాజీ సభ్యుడు అఖిలేష్ రంజన్ నేతృత్వంలోని ఈ కమిటీ…కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ విధానాన్ని తెచ్చింది. మరి ఆ విధానాన్ని ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌లోనే తీసుకువస్తారా..లేక పాత పన్నుల విధానాన్నే కొనసాగిస్తారా అన్నది చూడాలి. మొత్తంమీద టాక్స్ ల విషయంలో మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే సూచనలే కనబడుతున్నాయని ఆర్ధిక వేత్తలు అంటున్నారు.