ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదులు, ఆయుధ లారీ సీజ్

En route from Punjab to Kashmir.. Trucks with 3 Suspected Militants & AK-47 Seized, ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదులు, ఆయుధ లారీ సీజ్

దేశంలో భారీ దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కుట్రలను భారత్ భగ్నం చేసింది. దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్లాన్లు వేస్తున్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తమైంది. జమ్ముకశ్మీర్‌తో పాటుగా సరిహద్దు రాష్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం కథువా జిల్లాలో తనిఖీలు చేపట్టారు. లఖన్‌పూర్ వద్ద తనిఖీలు చేపడుతున్న సమయంలో ఓ ట్రక్కును పోలీసులు అడ్డుకుని చెక్ చేశారు. అందులో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని గుర్తించారు. మొత్తం ఆరు ఏకే-47 తుపాకులు కూడా గుర్తించారు. లారీపై ఉన్న అడ్రస్‌తో అది పుల్వామా జిల్లాకు చెందినదిగా గుర్తించారు. అంతేకాదు మరో ముగ్గురు ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేశారు.

జమ్ముకశ్మీర్‌ స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారత్‌లో దాడులకు పాక్ కుట్రలు పన్నుతోంది. ప్రత్యక్షంగా ఎదుర్కోలేక ఉగ్రవాదులను దేశంపైకి ఉసిగొల్పుతుందంటూ నిఘావర్గాలు పలుమార్లు హెచ్చిరంచాయి. కాగా, బుధవారం లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది అసిఫ్‌ మక్బుల్‌ భట్‌ను సైన్యం హతమార్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *