Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 82 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 182143. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89995. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 86984. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5164. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 30 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. లాక్ డౌన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా ఆదేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సి.ఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో చర్చించారు. కంటైన్మేంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం సూచించిన సడలింపులను అమలు చేయాలని నిర్ణయించారు. కంటైన్మంట్ జోన్లలో కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి పూట కర్ఫ్యూ కూడా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేయాలని ఆదేశించారు.
  • విశాఖ: డాక్టర్ సుధాకర్ కేసు. కేజీహెచ్ లో రెండో రోజు ముగిసిన సీబీఐ విచారణ. కేజీహెచ్ వైద్యాధికారులతో మాట్లాడిన సీబీఐ అధికారి. సీసీ ఫుటేజీని పరిశీలించిన సీబీఐ. 16 న క్యాజువాల్టీలో డాక్టర్ సుధాకర్ కు పరీక్షలు చేసిన కేజీహెచ్ వైద్యులు.
  • ఢిల్లీ లో కరోనా విజృంభన. ఢిల్లీ లో కొత్తగా 1295 కరోనా పాజిటివ్ కేస్ లు ,13 మంది మృతి. ఢిల్లీ రాష్ట్రంలో 19844 కి చేరిన కరోనా కేసులు నమోదు. 473 మంది కరోనా తో మృతి
  • రుతుపవనాలు ఇంకా కేరళ తీరానికి తాకలేదు. దీని పై మేము క్రమం తప్పకుండా మానిటరింగ్ చేస్తున్నాం. జూన్ 1 నుండి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అనుకుంటున్నాం. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ సమీపంలో ఈ రోజు అల్ప పీడనం ఏర్పడింది. జూన్ 2 కి తుఫానుగా మారుతుందని మేము అనుకుంటున్నాం. జూన్ 3 సాయంత్రం నాటికి గుజరాత్ ,ఉత్తర మహారాష్ట్ర తీరం వైపుకు చేరుకుంటుంది. మృత్యుంజయ్ మోహపాత్రా, ఢిల్లీ IMD.
  • జమ్మూ కాశ్మీర్‌లో సీనియర్ ఐఎఎస్ అధికారి కి కరోనా పాజిటివ్‌. ఆయనతో పాటు సమావేశానికి హాజరైన పలువురు అధికారులు,వైద్యులను హోమ్ క్వారంటైన్ లో వెళ్లాలని సూచన.
  • మొబైల్ సేవల కోసం 11 అంకెల నంబరింగ్ ప్లాన్‌ను ట్రాయ్ సిఫారసు చేసినట్లు కొన్ని మీడియా సంస్థల లో వార్తలు వచ్చాయి. TRAI సిఫారసు ప్రకారం,దేశం లో 10-అంకెల నెంబర్ కొనసాగుతుంది. మేము 11-అంకెల నంబరింగ్ ప్లాన్‌కు మార్చడాన్ని ఖండిస్తున్నాం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.

PSL Copies IPL: ఇదేం పని..ఐపీఎల్​ ప్రోమో కాపీ కొట్టిన పాకిస్థాన్​ సూపర్​​ లీగ్!​

పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ ఐదో ఎడిషన్‌కు రంగం సిద్దమైంది. ​ ట్రోఫీని నిన్న(గురువారం) గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అయితే పాకిస్థాన్ మరోసారి సోషల్ మీడియా ముందు బొక్కబోర్లా పడింది. ప్రమోషనల్ ఈవెంట్ యాజ్‌టీజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రోమోని పోలి ఉండటంతో..వివాదం రాజుకుంది.
PSL Copies IPL: PSL left red-faced after promotional campaign copied from IPL, PSL Copies IPL: ఇదేం పని..ఐపీఎల్​ ప్రోమో కాపీ కొట్టిన పాకిస్థాన్​ సూపర్​​ లీగ్!​

PSL Copies IPL:  పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ ఐదో ఎడిషన్‌కు రంగం సిద్దమైంది. ​ ట్రోఫీని నిన్న(గురువారం) గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అయితే పాకిస్థాన్ మరోసారి సోషల్ మీడియా ముందు బొక్కబోర్లా పడింది. ప్రమోషనల్ ఈవెంట్ ప్రోమో.. యాజ్‌టీజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రోమోని పోలి ఉండటంతో..వివాదం రాజుకుంది. ఐపీఎల్​​ ప్రోమోను కాపీ కొట్టిన టైటిల్​ స్పాన్సర్​ హబీబ్​ బ్యాంక్..సేమ్ అలానే పీఎస్​ఎల్​ ప్రోమోను తయారు చేసింది​. దీంతో నెటిజన్లు ఫిర్యాదు చేయడంతో..పాక్ క్రికెట్ లీగ్ అధికారులు డిఫెన్స్‌లో పడ్డారు. వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. 2016 లో లీగ్ ప్రారంభించినప్పటి నుండి పీఎస్ఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న హబీబ్ బ్యాంక్ మార్కెటింగ్ హెడ్ ఈ విషయంపై తాము విచారణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వెంటనే సదరు ప్రోమోను నిలిపివేశారు. ఐపీఎల్​ కోసం ఎయిర్​టెల్​ డిజైన్ చేసిన ఓ ప్రకటనలాగే తమ వీడియో ఉన్నట్లు పీఎస్ఎల్ నిర్వాహకులు కూడా ధృవీకరించారు. 

కాగా మొదటిసారి టోర్నీలోని మ్యాచులన్నింటిని పాకిస్థాన్‌లోనే నిర్వహిస్తున్నారు. లాహోర్‌, ముల్తాన్‌, రావల్పిండి,  కరాచీ నగరాలు మ్యాచులకు వేదిక కానున్నాయి.  ఫిబ్రవరి 20 నుంచి మార్చి 22 వరకు పీఎస్​ఎల్​ లీగ్‌ జరగనుంది.

 

ఇది కూడా చదవండి :  ‘భీష్మ’ ట్విట్టర్ రివ్యూ : నితిన్ మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు..!

Related Tags