ప్రపంచ కుబేరుల జాబితాలోకి ఎలన్ మస్క్

ఎలన్ మస్క్‌.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిజినెస్ దిగ్గజాలు చర్చించుకుంటున్న  పేరు. ఎందుకంటే ఇతడు ప్రపంచ కుబేరుల జాబితాలో వేగంగా దూసుకుపోతున్నాడు. ఫ్రెంచ్ లగ్జరీ వ్యాపారవేత్త...

ప్రపంచ కుబేరుల జాబితాలోకి ఎలన్ మస్క్
Follow us

|

Updated on: Aug 18, 2020 | 12:40 PM

ఎలన్ మస్క్‌.. ఈ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బిజినెస్ దిగ్గజాలు చర్చించుకుంటున్న  పేరు. ఎందుకంటే ఇతడు ప్రపంచ కుబేరుల జాబితాలో వేగంగా దూసుకుపోతున్నాడు. ఫ్రెంచ్ లగ్జరీ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్డ్‌ను అధిగమించి పరుగులు పెడుతున్నాడు.

టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌లో గత ​​కొద్ది రోజులుగా మందగించిన ఆయన ఆస్తుల విలువ తాజాగా రికార్డు స్థాయిలో పెరిగింది. దాంతో ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో నాల్గవ స్థానానికి చేరుకున్నాడు. సోమవారం టెస్లా ఇంక్‌ షేర్‌ వాల్యూ 11 శాతం పెరిగింది. ఫలితంగా ఆయన ఆస్తుల విలువ 7.8 బిలయన్లు పెరిగింది. ప్రస్తుత పెరుగుదలతో ఎలన్‌ మస్క్‌ ఫ్రెంచ్ లగ్జరీ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్డ్‌ను బీట్ చేశాడు.

ప్రస్తుతం ఎలన్‌ మస్క్‌ 84.8 బిలయన్ల సంపదతో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ తర్వాతి స్థానంలో నిలిచారు. ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితా‌లో జుకర్‌ బర్గ్‌ మూడవ స్థానంలో ఉండగా.. ఎలన్ మాస్క్ ఆ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. ఈ ఏడాది టెస్లా షేర్లు 339శాతం పెరిగాయి. దాంతో ఈ సంస్థ ఎస్‌ అండ్‌ పీ 500 ఇండెక్స్‌లో చేరుతుందనే అంచనాలు భారీగా పెరిగాయి.