కరోనా ఎఫెక్ట్.. 11వేల మంది ఖైదీల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కోవిడ్-19 భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు 11వేల మంది

  • Tv9 Telugu
  • Publish Date - 9:20 pm, Fri, 27 March 20

కోవిడ్-19 భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు 11వేల మంది ఖైదీలను పెరోల్, బెయిల్‌పై విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కూడా స్పష్టం చేశారు. అయితే నేర తీవ్రత తక్కువగా ఉండి 7 సంవత్సరాల కంటే తక్కువ జైలు శిక్ష పడిన వారిని, నేరం రుజువు కానప్పటికీ వివిధ కేసుల్లో జైలు జీవితాన్ని గడుపుతున్న ఖైదీలను మాత్రమే విడుదల చేస్తున్నట్లు వివరించారు. ఉగ్రవాదం, ఆర్థిక కుంభకోణాల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఇందుకు అనర్హులని మంత్రి తేల్చి చెప్పారు. కాగా.. ఈ రోజు ఒక్కరోజే మహారాష్ట్రలో 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 153కు చేరింది.