శ్రీకాళహస్తిలో 11 కరోనా కేసులు.. క్వారంటైన్‌కు బాధిత కుటుంబాలు..

ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా తెలిపారు. కరోనా కేసుల బారినపడ్డ వారిలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. ఇద్దరు మెడికల్‌ షాపుల యజమానులతో పాటు మరో వ్యక్తికి సోకినట్లు తెలిపారు. తిరుపతి సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌లో నిర్వహించిన టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో కలెక్టర్‌ ఈ కేసుల వివరాలు తెలిపారు. […]

శ్రీకాళహస్తిలో 11 కరోనా కేసులు.. క్వారంటైన్‌కు బాధిత కుటుంబాలు..
Follow us

| Edited By:

Updated on: Apr 19, 2020 | 10:37 PM

ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్‌ భరత్‌ గుప్తా తెలిపారు. కరోనా కేసుల బారినపడ్డ వారిలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా.. ఇద్దరు మెడికల్‌ షాపుల యజమానులతో పాటు మరో వ్యక్తికి సోకినట్లు తెలిపారు.

తిరుపతి సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌లో నిర్వహించిన టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో కలెక్టర్‌ ఈ కేసుల వివరాలు తెలిపారు. కరోనా సోకిన బాధితుల కుటుంబాలను క్వారంటైన్‌కు తరలించామన్నారు. అయితే తాజాగా నమోదైన కేసులతో వారికి సంబంధించిన కాంటాక్ట్‌లను కూడా ట్రేస్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో.. ఇక శ్రీకాళహస్తిలో లాక్‌డౌన్‌ అమల్లో ఎలాంటి మినహాయింపులు లేవని జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు.