ఏనుగు గోడ దూకేస్తే..ఏమవుతుంది..?  

A video of a herd of elephants has gone viral online and it shows the animals, ఏనుగు గోడ దూకేస్తే..ఏమవుతుంది..?  

పిల్లి గోడ దూకడం మాములే..కోతులు ఆ ఇంటి పైకప్పు నుంచి ఈ ఇంటి పైకి దూకేస్తుంటాయి..కానీ, భారీ ఖాయంతో ఉన్న ఏనుగు గోడ దూకడం మీరు ఎక్కడైనా చూశారా..? వామ్మో ఏనుగు గోడలు దూకడం ఏంటనే కదా మీ ఆశ్చర్యం..కానీ కర్ణాటకలోని హస్పూర్‌ గ్రామంలో మాత్రం ఏకంగా ఏనుగుల గుంపే గోడ దూకి అడవిలోకి వెళ్లిపోయాయి. దీనికి సంబంధించిన పాత వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీన్‌ కశ్వన్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. అందులోని చిత్రాలను బట్టి చూస్తే..ఏనుగుల మంద దారి తప్పి ఊర్లోకి వచ్చింది. తిరిగి అడవికి వెళ్లాలంటే సరైన మార్గం కనిపించలేదు. దీంతో గజరాజుల గుంపుకు ఏ వైపుకు వెళ్లాలో తెలియలేదు. కనుచూపు మేరలో కూడా వాటికి ఏ దారి కనిపించలేదు..దీంతో తప్పని పరిస్థితిలో అక్కడే ఉన్న గోడ దూకి అడవిలోకి వెళ్లాలని భావించాయి. వరుస పెట్టి ఒక్కో ఏనుగు అతి కష్టం మీద గోడ దూకేశాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతపెద్ద ఏనుగులు గోడ దూకేందుకు పడ్డ కష్టాన్ని చూసి పలువురు నెటిజన్లు స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *