Elephant Attack: చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఏనుగుల గుంపు బీభత్సం.. పంట పొలాలను నాశనం చేస్తున్న గజరాజులు..

Elephant Attack: చిత్తూరు జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఏపీ, కర్ణాటక తమిళనాడు

Elephant Attack: చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఏనుగుల గుంపు బీభత్సం.. పంట పొలాలను నాశనం చేస్తున్న గజరాజులు..
Follow us

|

Updated on: Jan 02, 2021 | 12:36 PM

Elephant Attack: చిత్తూరు జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఏపీ, కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లో తిష్టవేసి తిరుగుతున్నాయి. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. చేతికందొచ్చిన పంటను నాశనం చేయడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ఏనుగుల గుంపు దాడితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. తమిళనాడు వైపు నుంచి కుప్పం సమీపంలోని తంగాల్ సమీపంలోనే ఎక్కువగా సంచరిస్తున్నాయి. దీంతో ఏపీ కర్ణాటక తమిళనాడు అధికారుల సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. జనావాసాలు, పంట పొలాల్లోకి రాకుండా ట్రాకర్ల ద్వారా అడవుల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఏనుగులు రెండు గుంపులుగా విడిపోయి సంచరిస్తున్నాయి. అధికారులు రాత్రి సమయాల్లో ఏనుగులు ఉన్న ప్రాంతాల్లో మకాం వేసి నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. సరిహద్దు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.