Breaking News
  • దేశవ్యాప్తంగా 121 మంది దర్యాప్తు అధికారులకు కేంద్ర హోంమంత్రి పతకాలు. దర్యాప్తులో ప్రతిభ చూపిన కేంద్ర దర్యాప్తు విభాగాల అధికారులకు పతకాలను ప్రకటించిన కేంద్రం. సీబీఐ హైదరాబాద్ ఎస్పీ కళ్యాణ్ కు కేంద్ర హోంమంత్రి పతకం.
  • సంజ‌య్ ద‌త్ ఆరోగ్యం గురించి స్పందించిన భార్య మాన్య‌తా ద‌త్‌: భ‌గ‌వంతుడు మ‌రోసారి ప‌రీక్షిస్తున్నాడ‌ని వెల్ల‌డి. ఓర్చుకుంటే ఈ క‌ష్ట‌కాలాన్ని దాట వ‌చ్చ‌ని ధీమా. సంజ‌య్‌దత్ క్షేమాన్ని కోరుకుంటున్న ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. అన‌వ‌స‌ర‌మైన రూమ‌ర్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరిన మాన్య‌త‌. సంజ‌య్ ఫైట‌ర్ అని కితాబిచ్చిన మాన్య‌త‌. అంద‌రి ప్రార్థ‌న‌లు, ఆశీర్వాదాలు కావాల‌న్న మాన్య‌త‌. పాజిటివిటీని పంచాల‌ని కోరిన మాన్య‌త.
  • విజయవాడ: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ ap ప్రభిత్వం ఉత్తర్వులు. హౌస్ సర్జన్, పిజి డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు పెంపు. ఎంబీబీఎస్ విద్యార్థులకు 19,589. పిజి డిగ్రీ విద్యార్థులకు 1 ఇయర్ 44,075, 2 ఇయర్ 46,524, 3 ఇయర్ 48, 973 కు పెంపు.
  • ఉత్తరాఖండ్‌కు పొంచి ఉన్న వర్షాలు, వరదల ముప్పు. భారీ వర్షసూచన జారీ చేసిన భారత వాతావరణ శాఖ. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరిక. భాగేశ్వర్, పిత్తోరాగఢ్, నైనితాల్, ఉద్ధమ్ సింగ్ నగర్, డెహ్రాడూన్, హరిద్వార్, చమోలీ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం.
  • మణికొండ మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ సమీపం లో కార్ ఆక్సిడెంట్. జబర్దస్త్ ఆర్టిస్ట్ అభి bmw కార్ మరో కారు బ్రిజా కార్ ఢీ. బ్రిజా కారును అతివేగంగా అభి ఢీ కొట్టినట్టు ఆరోపిస్తున్న బాధితుడు.
  • హైదరాబాద్ లో థీమ్ పార్కు ల నిర్మాణానికి శంకుస్థాపన . డిల్లీ , పూణె లో తరహాలో సీటీలో ఆరు చోట్ల థీమ్ పార్క్ లు . 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న జిహెచ్ఎంసి . మూడు నెలలో పార్క్ ల నిర్మాణం పూర్తి చేస్తాం: జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్.
  • చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా జాగర్‌గుండా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్. కోబ్రా 223, సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసుల జాయింట్ ఆపరేషన్. నలుగురు మావోయిస్టులు హతం, మారణాయుధాలు స్వాధీనం.

‘ వామ్మో ? ‘ సైనిక ‘ క్యాంటీన్ లో ‘ ఘీంకారాలా ‘ ?

Some people later chased the elephant away by waving fire., ‘ వామ్మో ? ‘ సైనిక ‘ క్యాంటీన్ లో ‘ ఘీంకారాలా ‘ ?

పశ్చిమ బెంగాల్ లోని హసీమారా ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరేం లేదు.. అక్కడి మిలిటరీ క్యాంటీన్ లోకి కామ్ గా చొర చొరబడింది ఓ గజరాజం. ఎక్కడినుంచి వచ్చిందో మరి.. లోపలికి ఎంటరవుతూనే అక్కడున్న కుర్చీలను, బల్లలను తొండంతో తోసివేస్తూ.. కాళ్లతో తన్నేస్తూ ముందుకు రాబోయింది. అయితే అక్కడి సిబ్బందిలో ఒకరు ధైర్యంగా ఓ అట్టముక్కకు నిప్పటించి దానికేసి చూపుతూ భయపెట్ట జూశాడు. అయితే అది బెదరలేదు సరికదా.. మరింత ముందుకు రావడానికి అడుగులు వేయగానే.. మనోడికి గ్రేట్ ఐడియా తట్టింది. ఓ చిన్న కర్రకు బట్ట చుట్టి.. దానికి నిప్పంటించి కాగడాలా చేశాడు.. దాన్ని ఆ ఏనుగమ్మకు చూపుతూ ముందుకు కదలగానే.. అప్పుడు అది వెనక్కు తగ్గి బయటకి నడిచింది. మన ‘ ధీర సైనికుడు ‘ వదలకుండా దాని వెంటబడ్డాడు. చివరకు ఆ ‘ ఫలహారశాల ‘ బయట ఓ పచ్చిక మైదానంలో కూడా కొద్దిసేపు ఈ ‘ హంగామా ‘ కొనసాగింది. ఆ కాగడా కాని కాగడాను కాసేపు అదేపనిగా చూసి ఆ గజరాజం వెనక్కి తాపీగా వెళ్ళిపోయింది. ఈ వీడియో వైరల్ అయిందంటే కాదూ మరి ?

Related Tags