కొబ్బరి చిప్పలో కూర్చిన క్రాకర్స్ పేలడం వల్లేనా ? ఏనుగు మృతిలో కొత్త కోణం

కేరళలోని పలక్కాడ్ జిల్లాలో గర్భస్థ ఏనుగు మృతికి సంబంధించి పోలీసులు, అటవీశాఖ జరుపుతున్న దర్యాప్తులో మరో కొత్త విషయం బయటపడింది. కొబ్బరి చిప్పలో కూర్చిన చిన్నపాటి..

కొబ్బరి చిప్పలో కూర్చిన క్రాకర్స్ పేలడం వల్లేనా ? ఏనుగు మృతిలో కొత్త కోణం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 06, 2020 | 1:25 PM

కేరళలోని పలక్కాడ్ జిల్లాలో గర్భస్థ ఏనుగు మృతికి సంబంధించి పోలీసులు, అటవీశాఖ జరుపుతున్న దర్యాప్తులో మరో కొత్త విషయం బయటపడింది. కొబ్బరి చిప్పలో కూర్చిన చిన్నపాటి నాటుబాంబుల వంటి పేలుడు పదార్థాలు నోటిలో  పేలడం వల్లే అది మరణించిందని మన్నార్కడ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ సునీల్ కుమార్ తెలిపారు. క్రాకర్స్ కూర్చిన పైన్ యాపిల్ తినడంవల్లే ఇది మరణించినట్టు ఇప్పటివరకు వార్తలు వచ్చాయి.  అయితే  బహుశా ఈ ఏనుగు  కొబ్బరికాయను పగులగొట్టి.. అందులో క్రాకర్స్ ఉన్న భాగాన్ని తిని ఉంటుందని, దీంతో గజరాజు నోటి భాగం తీవ్రంగా గాయపడిందని భావిస్తున్నారు. ఈ కారణంగా అది రోజుల తరబడి ఆహారం తినలేక పోగా.. కనీసం నీరు కూడా తాగలేకపోయింది. అటు- ఈ కేసులో మొట్టమొదటి నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సాక్ష్యాల సేకరణలో భాగంగా ఈ  వ్యక్తిని  ఈ జిల్లాలో స్పాట్ కు తీసుకువెళ్లినట్టు సునీల్ కుమార్ వెల్లడించారు. ఓ షెడ్ లో పేలుడు పదార్థాలు తయారు చేసే మరో ఇద్దరికి ఇతగాడు సాయం చేస్తుంటాడని తెలిసిందన్నారు. రబ్బర్ ను సేకరించి దానితో వస్తువులు తయారు చేసే సుమారు 40 ఏళ్ళ ఇతడ్ని విల్సన్ గా గుర్తించారు. ఇతని సాయం పొందే మరో ఇద్దరు అనుమానితులు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??