Uttarakhand Elections 2022: ఉత్తరాఖండ్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. అధిష్టానానికి చేరిన అభ్యర్థుల జాబితా.. సిట్టింగ్‌లకు కోత!

అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఉత్తరాఖండ్ రాజకీయాలు రసవత్తంగా మారాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటిపై చూస్తున్నారు.

Uttarakhand Elections 2022: ఉత్తరాఖండ్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. అధిష్టానానికి చేరిన అభ్యర్థుల జాబితా.. సిట్టింగ్‌లకు కోత!
Uttarakhand Elections 2022

Uttarakhand Elections 2022: అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఉత్తరాఖండ్ రాజకీయాలు రసవత్తంగా మారాయి. 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటిపై చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల, రాష్ట్ర కేబినెట్ మంత్రి యశ్పాల్ ఆర్య అతని కుమారుడు ఎమ్మెల్యే సంజీవ్ ఆర్యతో కలిసి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరటనిస్తుందని చెప్పొచ్చు. అంతేకాకుండా, రావత్ ప్రభుత్వంలో మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ కూడా బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, బీజేపీ నేతలు ఊహించిన వలసలను తగ్గించారన్నారు.”ఇది పెద్ద సమస్య కాదు, మాది చాలా పెద్ద కుటుంబం ఉన్న పార్టీ.. ఇటీవల ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు, ప్రజలు ఒక పార్టీని వదిలి మరో పార్టీలోకి చేరుతున్నారంటే అది పెద్ద సమస్య కాదు” అని ఆయన అన్నారు.

2016లో బీజేపీలో చేరిన ఉత్తరాఖండ్‌కు చెందిన తొమ్మిది మంది కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరిగి సొంత పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ విస్తరణతో పాటు పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది అధికార భారతీయ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో విడివిడిగా సమావేశమవుతున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వుహ్యంపై ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సమావేశమయ్యారు. 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఉత్తరాఖండ్‌లో ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం’ ఏర్పాటు చేస్తామని ఉత్తరాఖండ్ బీజేపీ తరఫున హామీ ఇచ్చింది.

నిజానికి ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అభిమానించే అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. ప్రజల అభిమాన జాబితాలో బీజేపీ ఎమ్మెల్యేలు లేని అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌కు కేంద్ర నాయకత్వం పంపనున్న నేత.. అసెంబ్లీకి వెళ్లి ప్రజల నాడిని అంచనా వేస్తారు. ఈ కేంద్ర నేతల ఫీడ్‌బ్యాక్‌ను కూడా టిక్కెట్ పంపిణీలో పరిగణనలోకి తీసుకుంటారు. దీని ఆధారంగా బీజేపీ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో సీ, డీ కేటగిరీ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కేంద్ర నేతలను బరిలోకి దింపబోతుండడంతో ప్రజల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని ముఖాన్ని ఖరారు చేయనున్నారు. ఇందుకోసం మొత్తం ఎమ్మెల్యేలు, సీట్ల రిపోర్ట్ కార్డు కేంద్ర నాయకత్వానికి చేరింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన పలువురు ఎమ్మెల్యేల టిక్కెట్లు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోత పడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లోపలు ఉన్న ఎమ్మెల్యేలు కూడా గ్రహించారు. ప్రజల్లో ఆయన ఇమేజ్ గత ఎన్నికల మాదిరిగా కేంద్ర నాయకత్వానికి కనిపించడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా అన్ని స్థానాలను కేటగిరీగా విభజించాం. అందుకు అనుగుణంగా అసెంబ్లీల వారీగా కేంద్ర నేత బాధ్యతలు నిర్వహిస్తారు. ఖచ్చితంగా తదుపరి ప్రభుత్వం పూర్తి మెజారిటీ బీజేపీదేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మదన్ కౌశిక్ ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే, రాష్ట్రంలో 2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తొమ్మిది మంది తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి మారారు. మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2016లో హరీష్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు. టర్న్‌కోట్లలో బహుగుణ, సుబోధ్ ఉనియాల్, ప్రదీప్ బాత్రా, కున్వర్ ప్రణవ్ సింగ్ ఛాంపియన్, రేఖా ఆర్య, ఉమేష్ శర్మ, అమృత రావత్, శైలేంద్ర మోహన్ సింఘాల్, శైలా రాణి రావత్ ఉన్నారు. మొత్తం తొమ్మిది మంది నేతలు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు.

మరోవైపు, పెట్రోలు, డీజిల్ ధరలు నిరంతరంగా పెరగడం వల్ల ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే పెరుగుతున్న ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో కాస్త దిగివచ్చింది. ఇటీవల దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి, కాంగ్రెస్‌కు ప్రోత్సాహకర ఫలితాలు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి వాటిని ‘దీపావళి కానుక’గా మార్చుకోవాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అయితే, రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై అధిక పెట్రోలు-డీజిల్ ధరల ప్రభావం చూపుతుందని భారతీయ జనతా పార్టీ ఆందోళన చెందుతోంది. దీంతో కేంద్ర పన్నులతో పాటు అయా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా టాక్సులు తగ్గిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలకు సామాన్యులకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజా నిర్ణయం ఎన్నికల నాటికి ఆశించినంతగా ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.అయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగనున్నాయి. ముఖ్యంగా అధిక పెట్రోలు మరియు డీజిల్ ధరలు పట్టణ వాహన యజమానులను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా పంటలకు సాగునీరు, పరిశ్రమలకు ఉపయోగించే వాటి ఖర్చులను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి. ఇందు కోసం, పెట్రోల్, డీజిల్ ధరలను మరింత తగ్గించడాన్ని ప్రభుత్వం ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఈ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని ఎన్నికల సమస్యగా మారుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also…  Manipur Elections 2022: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‎కు షాక్.. బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు..

Published On - 6:47 pm, Mon, 8 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu