UP Election 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. బీజేపీలోకి యులాయం సింగ్ కోడలు..

UP Election 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. బీజేపీలోకి యులాయం సింగ్ కోడలు..
Mulayam Singh Yadav Daughter In Law Aparna Yadav

సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బుధవారం భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు సీఎం..

Sanjay Kasula

|

Jan 19, 2022 | 2:18 PM

Uttar Pradesh Election 2022: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బుధవారం భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరనున్నారుబుధవారం ఉదయం 10 గంటలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ , డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సమక్షంలో అపర్ణా యాదవ్ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. ములాయం సింగ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్. అపర్ణా యాదవ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో లక్నోలోని కాంట్ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ జోషి చేతిలో ఓడిపోయారు. అయితే అపర్ణకు దాదాపు 63 వేల ఓట్లు వచ్చాయి. మరోవైపు, రీటా బహుగుణ జోషి ఎంపీ అయిన తర్వాత ఈ స్థానం ఖాళీ అయింది. 2019లో ఉప ఎన్నిక జరిగింది.. ఇందులో బీజేపీ గెలిచి సురేష్ చంద్ తివారీ నాల్గవసారి ఎమ్మెల్యే అయ్యారు.

ఈ సీటు సమస్య ఏంటంటే.. ఈ సీటు నుంచి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని రీటా బహుగుణ డిమాండ్ చేస్తోంది. ఇక్కడ నుంచి మరికొందరు పోటీలో ఉన్నారనే చర్చ కూడా జరుగుతోంది.

అఖిలేష్ ప్రచారం చేశారు..

ములాయం సింగ్ చిన్న కుమారుడి ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ.  2017 అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కాంట్ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఆయన తరపున అఖిలేష్ యాదవ్ కూడా ప్రచారం చేశారు. జోషి ఎంపీగా ఎన్నికైన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఈ స్థానాన్ని గెలుచుకుంది.

యూపీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో ఫిరాయింపుల పర్వం జోరుగా సాగుతోంది. ఇటీవల ముగ్గురు బీజేపీ మంత్రులు సహా పలువురు ఎమ్మెల్యేలు సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ తర్వాత వారు తిరిగి బీజేపీలోకి వస్తారంటూ ప్రచారం నడిచింది. అయితే కాన్పూర్ మాజీ పోలీసు కమిషనర్ అసీమ్ అరుణ్ ఒంటరిగా బిజెపిలో చేరారు. అయితే ఇవాళ  అపర్ణ అధికారికంగా బీజేపీలో చేరుతున్నారు.

సీఎం యోగి, ప్రధాని మోదీకి అపర్ణ వీరాభిమాని

సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నప్పటికీ అపర్ణా యాదవ్ బహిరంగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,  ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. నిజానికి ఉత్తరాఖండ్‌కి చెందిన అపర్ణ కూడా యోగి ఆదిత్యనాథ్‌తో చాలాసార్లు కనిపించారు. బీజేపీ ఆయనను లక్నో కాంట్ అసెంబ్లీ స్థానం నుంచి అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉంది. తమ్ముడి భార్య అపర్ణ యాదవ్‌కు టికెట్ ఇవ్వడంపై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. ‘బీజేపీకి మనకంటే మా కుటుంబంపైనే ఎక్కువ శ్రద్ధ కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి: Health Tips: బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే ఈ యమ్మీ యమ్మీ సూపర్ సూప్ ట్రై చేయండి..

TDP Vs YCP: డైలీ సీరియల్ని తలపిస్తున్న అనంత రాజకీయం.. కొనసాగుతున్న మాటల యుద్ధం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu