Akhilesh Yadav in UP Elections:ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Uttar Pradesh Assembly Election 2022)కు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు వ్యుహ ప్రతివ్యుహాలకు పదును పెడుతున్నాయి. ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్ అసెంబ్లీ నియోజకవర్గం(Karhal Constituency) నుంచి పోటీ చేస్తారనే వార్తలు తెరపైకి వచ్చాయి . సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా భావించే మెయిన్‌పురి జిల్లాలో అఖిలేష్ బరిలోకి దిగడంతో ఆపార్టీకి కలిసొస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీని ప్రభావం సమీపంలోని ఇతర సీట్లపైనా పడుతుందని అంచనా వేస్తున్నారు. అజంగఢ్‌లోని గోపాల్పూర్ స్థానం నుంచి అఖిలేష్ పోటీ చేస్తారని గతంలో ఊహాగానాలు వచ్చాయి. ప్రస్తుతం కొత్త పేరు తెరపైకి వచ్చింది.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ ప్రస్తుతం అజంగఢ్ నుంచి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే, అఖిలేష్ యాదవ్ తండ్రి, పార్టీ పోషకుడు ములాయం సింగ్ యాదవ్ పార్లమెంటరీ నియోజకవర్గమైన మెయిన్‌పురిలోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయవచ్చని చాలా కాలంగా చర్చ జరిగింది. మెయిన్‌పురి సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. అఖిలేష్ యాదవ్ ఈ స్థానం నుండి పోటీ చేయడం సమీప స్థానాలను ప్రభావితం చేస్తుంది.
అఖిలేష్ యాదవ్ మెయిన్‌పురి నుండి పోటీ చేస్తే, దాని ప్రభావం ఇతర సమీప జిల్లాలపై కనిపిస్తుంది. ఈ సీటుపై పోటీ చేయడం వల్ల కాన్పూర్, ఆగ్రా డివిజన్లలోని అనేక స్థానాలతో పాటు ఫిరోజాబాద్, ఎటా, ఔరయ్యా, ఇటావా, కన్నౌజ్‌తో సహా అనేక స్థానాలు ప్రభావితం కావచ్చు. ఎందుకంటే ఈ జిల్లాలు ఎస్పీకి ఎప్పటినుంచో కంచుకోటగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అఖిలేష్ రంగంలోకి దిగడం పార్టీకి చాలా రకాలుగా మేలు చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Samajwadi Party chief Akhilesh Yadav will contest elections from Mainpuri’s Karhal Assembly constituency: Sources#UPAssemblyElections2022
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 20, 2022
నిజానికి కర్హల్ నియోజకవర్గంలో ఎస్పీ ఆధిక్యత కనబరుస్తోంది. 2007, 2012, 2017లో వరుసగా మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయం సాధించింది. కర్హల్ అసెంబ్లీ సైఫాయికి దగ్గరగా ఉంది. ఇక్కడ ఎస్పీ చీఫ్ కుటుంబం జోక్యం చాలా ఉంటుంది. ఎస్పీకి చెందిన సోబ్రాన్ యాదవ్ గత మూడుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సాదాసీదా ఇమేజ్ ఉన్న సోబ్రాన్ తలపై ములాయం చేయి ఉందని అంటున్నారు. 2017 ఎన్నికలలో, SP అభ్యర్థి సోబ్రాన్ సింగ్ యాదవ్ 1,04,221 ఓట్లు పొందారు. 38,405 ఓట్ల మెజార్టీతో బిజెపికి చెందిన రామ్ షాక్యాను ఓడించారు. బీఎస్పీ ఇక్కడి నుంచి దల్వీర్ను తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. మరోవైపు ఇక్కడ యాదవుల ఓట్లను చీల్చేందుకు కౌశల్ యాదవ్‌ను ఆర్ఎల్డీ తన అభ్యర్థిని చేసింది.
Read Also…. Boy Complaint: సైకిల్ పోయిందని పోలీసులకు బాలుడి ఫిర్యాదు.. తండ్రికి ఫోన్ చేసి అవాక్కైన పోలీసులు!