Akhilesh Yadav: ఇకపై బీజేపీ ఎమ్మెల్యేలను, మంత్రులను పార్టీలో చేర్చుకోం.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ కీలక వ్యాఖ్యలు

UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలన్నీ మాటల తూటాలతో రాజకీయాలను

Akhilesh Yadav: ఇకపై బీజేపీ ఎమ్మెల్యేలను, మంత్రులను పార్టీలో చేర్చుకోం.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ కీలక వ్యాఖ్యలు
Akhilesh Yadav

UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలన్నీ మాటల తూటాలతో రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అంతేకాకుండా రాజకీయ పరిణామాలు సైతం శరవేగంగా మారుతున్నాయి. ఇటీవల బీజేపీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఓ మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు సైతం బీజేపీని వీటి అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఈ క్రమంలో అఖిలేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ ఇకపై బీజేపీ ఎమ్మెల్యేలను, మంత్రులను పార్టీలోకి తీసుకోదంటూ అఖిలేష్ యాదవ్ శనివారం పేర్కొన్నారు. ఇకపై బీజేపీ ఎమ్మెల్యేలను, మంత్రులను కానీ పార్టీలో చేర్చుకోనని బీజేపీకి చెప్పానని.. వారు కావాలనుకుంటే (తమ నేతలకు) టిక్కెట్లు నిరాకరించవచ్చంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు తాను 2 సీట్లు కేటాయించాననని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. కానీ భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కూటమిలో భాగం కావడానికి నిరాకరించారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. గత కొన్ని రోజుల నుంచి అఖిలేష్ పలు ప్రాంతీయ పార్టీలతో పొత్తులపై సమాలోచనలు చేస్తున్నారు. రాష్ట్రంలో మళ్లీ ఎస్పీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో ‘వర్చువల్‌గా’ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన 2,000 నుంచి 2,500 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. నివేదికల ప్రకారం.. అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించి కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయంలో తగు చర్యలు తీసుకుంటామని.. ఇప్పటికే నోటిసు అందించినట్లు లక్నో డీఎం అభిషేక్ ప్రకాశ్ తెలిపారు. అంతేకాకుండా గౌతమ్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. బాధ్యతగా ఎస్‌హెచ్ఓను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. దీనిపై ఎస్పీ చీప్ అఖిలేష్.. నాయకులకు పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈసీ మార్గదర్శకాలు, కోవిడ్ ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని అఖిలేష్ సూచించారు.

Also Read:

Punjab Election 2022: కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. సీఎం చన్నీ, సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారంటే..?

UP Election 2022: బీజేపీ తొలి జాబితా విడుదల.. సీఎం యోగి పోటీ అక్కడి నుంచే..

Published On - 4:05 pm, Sat, 15 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu