UP Polls Congress Manifesto: 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. యూపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ

UP Polls Congress Manifesto: 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు.. యూపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ
Congress Priyanka Gandhi

UP Elections 2022: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికలకు అధికార బీజేపీ(BJP) మంగళవారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే. మరుసటి రోజు ఇవాళ(బుధవారం) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

Janardhan Veluru

|

Feb 09, 2022 | 4:35 PM

UP Elections 2022: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికలకు అధికార బీజేపీ(BJP) మంగళవారం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే. మరుసటి రోజు ఇవాళ (బుధవారం) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.  యూపీలో అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) హామీ ఇచ్చింది. ఇందులో పోలీస్, హెల్త్, విద్యా రంగాల్లో 12 లక్షల ఖాళీలను భర్తీ చేయనుండగా.. 8 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేజీ మొదలు పీజీ వరకు ఉచిత విద్య అందించనున్నట్లు ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.

యూపీ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి తోడ్పడే ప్రభుత్వాన్ని యూపీ ప్రజలు ప్రధానంగా కోరుకుంటున్నారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో పాజిటివ్ మార్పులు తీసుకొచ్చే రాజకీయ వ్యవస్థ రాష్ట్రానికి అవసరమన్నారు. యూపీ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్లు కాంగ్రెస్ పార్టీ అజెండా ఉంటుందని పేర్కొన్నారు. యూపీ ప్రజల సలహాలు, సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు వివరించారు.

యూపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తున్న ప్రియాంక గాంధీ..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఎత్తివేయనున్నట్లు ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. అలాగే అక్రమ కేసులతో జైల్లో మగ్గుతున్న వారికి విముక్తి కల్పిస్తామన్నారు. చేనేత, రైతులు, మాజీ సైనికులు, హస్త కళాకారుల కోసం మండలిలో ఐదు అదనపు సీట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు.. -20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన(పోలీస్, హెల్త్, విద్యా రంగాల్లో 12 లక్షల ఉద్యోగ ఖాళీలు, 8 లక్షల కొత్త ఉద్యోగ నియామకాలు) -ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేజీ మొదలు పీజీ వరకు ఉచిత విద్య -ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు -కోల్ సామాజిక వర్గానికి ఎస్టీ మోదా కల్పన -పాఠశాలల్లో వంటవారికి నెలసరి జీతం రూ.5,000కు పెంపు -విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కోవిడ్ వారియర్స్‌కు రూ.50లక్షల పరిమారం -కోవిడ్‌ బాధిత కుటుంబాలకు రూ.25వేల ఆర్థిక సాయం -అనుభవం, నిబంధనల మేరకు కాంట్రాక్ట్ టీచర్ల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ -చిన్న తరహా పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు

గురువారం తొలి విడత పోలింగ్..

యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ రేపు (ఫిబ్రవరి 10) జరగనుండగా.. ఫిబ్రవరి 14,20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీకి 39.67 శాతం ఓట్లు దక్కాయి. సమాజ్‌వాది పార్టీ 47 స్థానాలు, బీఎస్పీ 19 స్థానాలు, కాంగ్రెస్ ఏడు స్థానాల్లో విజయం సాధించాయి.

ఈ సారి అధికార బీజేపీకి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంటుండగా.. కొన్ని స్థానాల్లో మజ్లీస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది.

Also Read..

UP Assembly Elections 2022: యూపీ ఓటర్లు ఎవరి వైపు..? టీవీ9 భారత్‌వర్ష్ ఒపీనియన్ పోల్ ఏం చెబుతోంది?

Banks Privatization: బ్యాంకుల ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu