UP Election 2022: అఖిలేష్‌కు దళితుల మద్దతు అక్కర్లేదు.. భీమ్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Chandrashekhar Azad on Akhilesh Yadav: యూపీలో వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలతో

UP Election 2022: అఖిలేష్‌కు దళితుల మద్దతు అక్కర్లేదు.. భీమ్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Chandrashekhar Azad

Chandrashekhar Azad on Akhilesh Yadav: యూపీలో వచ్చే నెలలో (UP Election 2022) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలతో సమాజ్‌వాదీ పార్టీ కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రాణాళికలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పలు పార్టీల నాయకులు, ప్రతినిధులతో భేటీ అయ్యారు. దీనికోసం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో సైతం సంప్రదింపులు జరిపారు. భీమ్ ఆర్మీ చీఫ్ అడిగిన సీట్లకు అఖిలేష్ నిరాకరించారు. చంద్రశేఖర్ ఆజాద్ 10 సీట్లు అడగగా.. అఖిలేష్ మూడు సీట్లే ఆఫర్ చేసినట్లు భీమ్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ శనివారం మాట్లాడారు. వచ్చే నెలలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ రాజకీయ సంస్థ ఆజాద్ సమాజ్ పార్టీ.. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోదని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ స్పష్టంచేశారు. సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు దళితుల మద్దతు అక్కర్లేదని ఆజాద్ పేర్కొన్నారు.

అఖిలేష్ మమ్మల్ని అవమానించారు.. బహుజన సమాజాన్ని అవమానపరిచారు అంటూ చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. సీట్ల పంపకాలపై అఖిలేష్‌తో భేటీ జరిగిన మరుసటి రోజున ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ కూటమిలో దళిత నాయకులు వద్దు.. కానీ దళితుల ఓట్లు మాత్రం కావాలి.. అంటూ పేర్కొన్నారు. దళితులు ఆయనకు ఓటు వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మనం మాట్లాడలేమని భయం మొదలైందన్నారు. తమ సమస్యల గురించి అతనికి చెప్పండి.. మమ్మల్ని కొట్టినా, మా భూములు దోచుకున్నా, మా మహిళలపై అత్యాచారం చేసినా స్పందించరని పేర్కొన్నారు. పోత్తులపై అఖిలేష్ తమని మోసం చేశారని పేర్కొన్నారు. దీనిపై రెండు రోజుల్లో తదుపరి ప్రణాళికపై నిర్ణయం తీసుకుంటానని ఆజాద్ ప్రకటించారు. త్వరలోనే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కాగా.. ఆజాద్ సమాజ్ పార్టీతో పొత్తుపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. భీమ్ ఆర్మీ చీఫ్‌కు రెండు సీట్లు కేటాయిస్తామని చెప్పామని.. వాటిని ఆజాద్ నిరాకరించారని పేర్కొన్నారు. ఆయన కూటమిలో కొనసాగడానికి నిరాకరించారని పేర్కొన్నారు.

Also Read:

Akhilesh Yadav: ఇకపై బీజేపీ ఎమ్మెల్యేలను, మంత్రులను పార్టీలో చేర్చుకోం.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ కీలక వ్యాఖ్యలు

Punjab Election 2022: కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. సీఎం చన్నీ, సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారంటే..?

Published On - 4:40 pm, Sat, 15 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu