Elections 2022: యూపీ ఎన్నికలపై కమల దళం భారీ ఆశలు.. ప్రధాని మోదీకి చాలా కీలకం.

Elections 2022: యూపీ ఎన్నికలపై కమల దళం భారీ ఆశలు.. ప్రధాని మోదీకి చాలా కీలకం.
Assembly Elections

Elections 2022: ప్రస్తుతం దేశ రాజకీయాల దృష్టి ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పడింది. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్‌గా భావిస్తోన్న ఈ ఎన్నికల ఫలితం కోసం అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్‌ కూడా దృష్టి..

Narender Vaitla

|

Feb 12, 2022 | 8:06 PM

Elections 2022: ప్రస్తుతం దేశ రాజకీయాల దృష్టి ఐదు రాష్ట్రాల ఎన్నికలపై పడింది. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్‌గా భావిస్తోన్న ఈ ఎన్నికల ఫలితం కోసం అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్‌ కూడా దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితంపై కమల దళం భారీ ఆశలు పెట్టుకుంది. యూపీ ప్రజలు ఇచ్చే నిర్ణయం దేశ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పుతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మరి బీజేపీ తన హవాను కొనసాగించాలంటే యూపీలో ఎలాంటి విజయాన్ని అందుకోవాలి.? ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల తీరు ఎలా సాగనుంది లాంటి ఆసక్తికర వివరాలు మీకోసం..

దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే సర్వేలో తేలుతోన్న అంశాల ప్రకారం బీజేపీకి యూపీలో భారీ విజయం దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కానీ భవిష్యత్తులో దేశ వ్యాప్తంగా బీజేపీ హవా దేశవ్యాప్తంగా కొనసాగాలంటే యూపీలో బీజేపీ భారీ విజయాన్ని అందుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం యూపీలో బీజేపీ ఏమాత్రం ఓట్ల షేర్‌ తగ్గినా అది 2024లో జరగే లోక్‌ సభ ఎన్నికలపై ప్రభావం పడుతుంది.

ఇక గోవా విషయానికొస్తే సర్వేలో తేలుతోన్న వివరాల ప్రకారం ఇక్కడ హంగ్‌ ఏర్పడే అవకాశాలతో పాటు బీజేపీ సాధారణ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక మణిపూర్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హంగ్‌ లేదా సాధారణ విజయం దక్కే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే పంజాబ్‌లో బీజేపీ కనీసం పోటీ ఇచ్చే పరస్థితి కూడా లేదు. ఇక్కడ విజయం కాంగ్రెస్‌, ఏఏపీల మధ్య దోబూచులాడుతోంది. ఉత్తరఖాండ్‌ విషయానికొస్తే ఇక్కడ కూడా హంగ్‌తో పాటు, బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు సర్వేలో తేలింది.

ఈ ఏడాది జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 24.9 లక్షల మంది తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఓటర్ల విషయానికొస్తే 18.34 కోట్లమంది ఓటర్లు ఉండగా, వీరిలో 8.55 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు ఇచ్చే తీర్పు కచ్చితంగా భవిష్యత్తు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదిలా ఉంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, అటు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి పోటీ ఎదుర్కోక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల పశ్చిమబెంగాల్‌లో మమతా భారీ విజయంతో ఒక్కసారిగా ఆమె పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. ఇక ఆప్‌ కూడా తాజాగా జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మరి 2024లో ఎలాంటి వండర్‌ జరగనుందో వేచి చూడాలి.

Also Read: Andhra Pradesh: మూడు రాజధానుల అంశంపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

Viral Photo: ఈ ఫోటోలో హచ్‌ డాగ్‌ నక్కి నక్కి చూస్తోంది.. ఎక్కడుందో కనిపించిందా.?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu