4న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. కులగణన నివేదికపై చర్చ
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం జెట్ స్పీడ్‌తో కదులుతోంది. కీలకమైన బీసీ రిజర్వేషన్లను తేల్చే అంశాన్ని చివరి అంఖానికి చేరింది. ఫిబ్రవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కులగణన నివేదికపై చర్చించనుంది కేబినెట్. అదేరోజు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.సభలో కులగణన నివేదికపై స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. ఇప్పటికే కేబినెట్ సబ్‌కమిటీకి కులగణణ నివేదిక అందింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఒక నిర్ణయం తీసుకుని

తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం జెట్ స్పీడ్‌తో కదులుతోంది. కీలకమైన బీసీ రిజర్వేషన్లను తేల్చే అంశాన్ని చివరి అంఖానికి చేరింది. ఫిబ్రవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కులగణన నివేదికపై చర్చించనుంది కేబినెట్. అదేరోజు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.సభలో కులగణన నివేదికపై స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తారు. ఇప్పటికే కేబినెట్ సబ్‌కమిటీకి కులగణణ నివేదిక అందింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఒక నిర్ణయం తీసుకుని, పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని రేవంత్‌రెడ్డి సర్కార్ యోచిస్తుంది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపే అవకాశం ఉంది.
కులగణన సర్వేలో 55.85 శాతంగా బీసీలు ఉన్నాట్లు తేల్చారు. కొత్త లెక్కల ప్రకారం పథకాలు, రిజర్వేషన్ల అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా.. రిజర్వేషన్ల అమలుకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. బీసీలకు 40 శాతం కోటా పెంచుతామని ఎన్నికల టైమ్‌లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మొత్తం 50 రోజుల పాటు కులగణన సర్వే నిర్వహించారు. సర్వేలో లక్షా 3,889 మంది అధికారులు పాల్గొన్నారు. 96.9శాతం కుటుంబాలను సర్వే చేశారు అధికారులు. సర్వేలో 3 కోట్ల 54 లక్షల మంది తమ వివారాలను వెల్లడించారు. 3.1శాతం సర్వేలో పాల్గొనలేదని కమిషన్ రిపోర్టులో పేర్కొంది. ఫిబ్రవరి 5న మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. సభలో కులగణన నివేదిక ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. నివేదికపై చర్చ అనంతరం సభ ఆమోదం తెలపనుంది.
మార్చి 5 నుంచి ఇంటర్, మార్చి 17 నుంచి పదోపరీక్షల షెడ్యూల్ ఉంది. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహిస్తే పరీక్షల నిర్వహణకు ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా? అనే కోణంలో ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే స్థానిక ఎన్నికలతో ఇంటర్‌పరీక్షలకు పెద్దగా ఇబ్బంది ఉండదని, పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి జరగనున్నందున ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు పెడితే సమస్య లేదని అధికారులు సీఎంకు రేవంత్‌కు సూచించినట్లు సమాచారం.