ఆఫర్ ముగియనుంది.. త్వరగా ట్యాంక్ ఫుల్ చేయించుకోండి.. రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు

ఆఫర్ ముగియనుంది.. త్వరగా ట్యాంక్ ఫుల్ చేయించుకోండి.. రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు
Rahul Gandhi (File Photo)

పెట్రోల్ రేట్ల పెరుగుదలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలను(petrol prices) కేంద్ర ప్రభుత్వం..

Ganesh Mudavath

|

Mar 05, 2022 | 10:03 PM

పెట్రోల్ రేట్ల పెరుగుదలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలను(petrol prices) కేంద్ర ప్రభుత్వం పెంచనుందని అన్నారు. త్వరలోనే ‘ఎన్నికల ఆఫర్’​ ముగుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజలు తమ వాహనాల పెట్రోల్ ట్యాంక్​లను నింపుకోవాలని సూచించారు. ఈ మేరకు ట్విట్టర్​వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పెట్రో ధరల పెంపును నిలిపివేసి, పోలింగ్ ముగియగానే బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతోందని మండిపడ్డారు. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉత్తరప్రదేశ్​సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ( Assembly Elections)ఎన్నికలు మార్చి 7తో ముగుస్తాయి. మార్చి10న ఓట్ల లెక్కింపు జరగనుంది.

మరోవైపు ఉక్రెయిన్‌ – రష్యా (Ukraine-Russia) మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెట్రో ధరలు భారీగా మండిపోనున్నాయి. గతేడాది నవంబర్‌ నుంచి దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీనిపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు 110 అమెరికన్‌ డాలర్లు దాటాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ.. దేశీయ మార్కెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మారలేదు.

Also Read

Tamilisai : శాసన సభ్యులు ఆ హక్కును కోల్పోయినట్లే.. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం లేకపోవడంపై స్పందించిన తమిళి సై..

Chiranjeevi: ఊరమాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్లకే ఓటేస్తున్న మెగాస్టార్.. ఫ్యాన్స్ కు పూనకాలే..

Manipur Elections: మణిపూర్‌లో ముగిసిన తుది విడత పోలింగ్.. పలుచోట్ల హింసాత్మక ఘటనలు!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu