Punjab Election 2022: కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. సీఎం చన్నీ, సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారంటే..?

Punjab Congress candidate list 2022: పంజాబ్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలోని అధికార పార్టీ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ

Punjab Election 2022: కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. సీఎం చన్నీ, సిద్ధూ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారంటే..?
Punjab Election 2022

Punjab Congress candidate list 2022: పంజాబ్ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలోని అధికార పార్టీ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ (Congress) శనివారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 86 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu ) అమృత్‌సర్ ఈస్ట్ నుంచి పోటీ చేయనుండగా, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ (Channi) చంకౌర్ సాహిబ్ నుంచి పోటీకి దిగనున్నారు. డేరా బాబా నానక్ నియోజవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి సుఖ్జిందర్ సింగ్ రంథావా, గిడ్డెర్‌బహ నుంచి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాజా అమరీందర్ పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. అంతేకాకుండా నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్‌కు మోగా నియోజకవర్గం టెక్కెట్ కేటాయించింది కాంగ్రెస్.

ఇదిలాఉంటే.. పంజాబ్‌లో (Punjab Election 2022) ఫిబ్రవరి 14న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 10న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో కెప్టెన్ పార్టీ సహ.. ఆమ్ ఆద్మీ పార్టీ, అకాళీదళ్, బీజేపీ సైతం పోటీకి దిగనున్నాయి. ఎలాగైనా కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలన్న లక్ష్యంగా పార్టీలు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నాయి.

Also Read:

UP Election 2022: బీజేపీ తొలి జాబితా విడుదల.. సీఎం యోగి పోటీ అక్కడి నుంచే..

Balineni Srinivasa Reddy: చిరంజీవి అందుకే సీఎంను కలిశారు.. చిచ్చు పెట్టేది చంద్రబాబే: మంత్రి బాలినేని

Click on your DTH Provider to Add TV9 Telugu