నాగార్జునసాగర్‌లో మొదలైన ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ

నాగార్జున సాగర్ ఎన్నికల సందడి మళ్లీ మొదలైంది. ఇవాళ్టి నుంచి సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు.

నాగార్జునసాగర్‌లో మొదలైన ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ
Nagarjuna Sagar Bypoll Nominations Start From Today
Follow us

|

Updated on: Mar 23, 2021 | 7:54 AM

Nagarjuna sagar bypoll Nominations: నాగార్జున సాగర్ ఎన్నికల సందడి మళ్లీ మొదలైంది. ఇవాళ్టి నుంచి సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు. ఈనెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఏప్రిల్ 17న ఉప ఎన్నిక నిర్వహించి… మే 2న కౌంటింగ్‌ నిర్వహిస్తారు.

నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే నాగా‌ర్జు‌న‌సా‌గర్‌ ఉప‌ఎ‌న్నికకు ఎన్ని‌కల కమిషన్‌ మంగ‌ళ‌వారం నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌దల చేయ‌ను‌న్నది. నేటి నుంచి ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి నుంచి నామపత్రాలు స్వీక‌రించను‌న్నారు అధికారులు. ఈనెల 31న పత్రాలను పరిశీలించనుండగా.. ఏప్రిల్‌ 3వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు.

కాగా, నామినేషన్ల స్వీకరణ కోసం నిడ‌మ‌నూరు తహసీల్దార్‌ కార్యా‌ల‌యంలో అధి‌కా‌రులు ఏర్పాట్లు చేశారు. నామి‌నే‌షన్ల స్వీక‌ర‌ణకు ప్రత్యేక చాంబర్‌, హెల్ప్‌డెస్క్‌ ఏర్పా‌టు‌ చే‌శారు. నామి‌నే‌షన్లు సమ‌ర్పించే సమ‌యంలో కొవిడ్‌ నిబం‌ధ‌నల మేరకు అభ్యర్థితో పాటు ఒక్కరిని మాత్రమే అను‌మ‌తిం‌చ‌ను‌న్నారు. ఎన్ని‌కల రిట‌ర్నింగ్‌ అధి‌కారి, మిర్యా‌ల‌గూడ ఆర్డీవో రో‌హి‌త్‌‌సింగ్‌ ఏర్పా‌ట్లను పర్యవేక్షిస్తున్నారు. సాగర్‌ నియో‌జ‌క‌వ‌ర్గంలో 2,19,745 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 1,08,907 మంది పురు‌షులు, 1,10,838 మంది మహి‌ళలు ఉన్నారు. ఏప్రిల్ 17న ఉప ఎన్నిక నిర్వహించి… మే 2న కౌంటింగ్‌ నిర్వహిస్తారు.

కాగా, ఇప్పటివరకు ఉపఎన్నికకు సంబంధించి టీఆర్ఎస్, బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ ఇప్పటికే సీనియర్ నేత జానారెడ్డి పేరును ఖరారు చేసింది. ఆయన ఈనెల 30న నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్, రంజిత్ యాదవ్, గురవయ్య యాదవ్‌ టికెట్‌ను ఆశిస్తున్నారు. బీజేపీ తరుఫున ఎవరు పోటీ చేస్తారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. TRS తన అభ్యర్థిని ప్రకటించాకే BJP అభ్యర్థిని వెల్లడించే అవకాశం ఉంది.

ఇదీ చదవండిః ఆధార్ లింక్ ఉంటేనే భాగ్యనగరంలో ఉచిత నీటి పథకం.. మరో నెల రోజుల పాటు గడువు పొడిగింపు

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు