Delhi Assembly Election: ఢిల్లీలో పోలింగ్ షురూ.. కేజ్రీవాల్‌ హ్యాట్రిక్‌ కొడతారా? బీజేపీకి అవకాశం ఇస్తారా?

ఢిల్లీలో కేజ్రీవాల్‌ హ్యాట్రిక్‌ కొడతారా? లేక పాతికేళ్ల కరువును అధిగమించి బీజేపీ విజయదుందుభి మోగిస్తుందా? దేశమంతా ఆసక్తి రేపుతున్న ఢిల్లీ దంగల్‌లో అత్యంత కీలకఘట్టం మొదలైంది. 70 అసెంబ్లీ సీట్లు ఉన్న ఢిల్లీలో పోలింగ్‌ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ఈసారి దాదాపు కోటి 50 లక్షల మంది ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.

Delhi Assembly Election: ఢిల్లీలో పోలింగ్ షురూ.. కేజ్రీవాల్‌ హ్యాట్రిక్‌ కొడతారా? బీజేపీకి అవకాశం ఇస్తారా?
Delhi Election 2025
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 05, 2025 | 9:08 AM

ఢిల్లీలో కేజ్రీవాల్‌ హ్యాట్రిక్‌ కొడతారా? లేక పాతికేళ్ల కరువును అధిగమించి బీజేపీ విజయదుందుభి మోగిస్తుందా? దేశమంతా ఆసక్తి రేపుతున్న ఢిల్లీ దంగల్‌లో అత్యంత కీలకఘట్టం మొదలైంది. 70 అసెంబ్లీ సీట్లు ఉన్న ఢిల్లీలో పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రధానంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికలకు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఎన్నికల ఫలితాలను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదే సమయంలో, ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది. ఇందుకు గానూ 13 వేల 766 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వాటిలో3వేలకు పోలింగ్‌ సెంటర్లను సమస్యాత్మకమైవనిగా గుర్తించి అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘాను పెంచారు.

ఒకవైపు ఢిల్లీలో ఎన్నికల కోలాహలం కనిపిస్తుంటే, పొద్దున్నే పూజల సందడి కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి పర్వేష్‌ వర్మ యమునా ఘాట్‌ దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు మాజీ మంత్రి మనీష్‌ సిసోడియా కూడా పూజలు చేశారు. కల్కాజీలోని ఒక ఆలయంలో సిసోడియా పూజలు నిర్వహించారు. ఇక, ఎన్నికల నేపథ్యంలో అయా పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించారు అధికారులు.

ఢిల్లీ ఓటర్లకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోలింగ్ నిర్వహించడం జరగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ఇలా రాశారు. ఓటర్లందరూ ఈ ప్రజాస్వామ్య ఉత్సవంలో పూర్తి ఉత్సాహంతో పాల్గొని తమ విలువైన ఓటును వేయాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా, మొదటిసారి ఓటు వేయబోతున్న యువ మిత్రులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ‘గుర్తుంచుకోండి – మొదట ఓటు, తరువాత రిఫ్రెష్మెంట్!’ అంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కల్కాజీ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా పోలింగ్ ప్రారంభమైన వెంటనే తన ఓటు వేశారు. ఆమె తన తండ్రి అమర్‌నాథ్ లాంబాతో కలిసి పోలింగ్ బూత్‌కు చేరుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిపై కల్కాజీ స్థానంలో అల్కా పోటీ చేస్తున్నారు.

హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో కీలక కామెంట్ చేశారు. ‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోయే సోదరీమణులు, సోదరులు తప్పుడు వాగ్దానాలు, కలుషితమైన యమున, మద్యం దుకాణాలు, చెడిపోయిన రోడ్లు, మురికి నీటికి ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమం పట్ల బలమైన ట్రాక్ రికార్డ్, ఢిల్లీ అభివృద్ధి పట్ల స్పష్టమైన దార్శనికత కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఒక్క ఓటు ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాజధానిగా మార్చగలదన్న అమిత్ షా.. మొదట ఓటు వేయండి, తరువాత రిఫ్రెష్మెంట్స్ తీసుకోండని కోరారు.