YS Jagan: జగన్‌తో సుబ్బరామిరెడ్డి కీలక భేటీ.. అందుకోసమేనా.!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఎంపీ సుబ్బరామిరెడ్డి భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన వీరిద్దరు కాసేపు చర్చించుకున్నారు.

YS Jagan: జగన్‌తో సుబ్బరామిరెడ్డి కీలక భేటీ.. అందుకోసమేనా.!
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2020 | 3:32 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఎంపీ సుబ్బరామిరెడ్డి భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన వీరిద్దరు కాసేపు చర్చించుకున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరు భేటీ కావడంపై ఆసక్తి నెలకొంది. వచ్చే నెల 2వ తేదీతో సుబ్బరామిరెడ్డి రాజ్యసభ పదవీకాలం ముగియనుండగా.. మరోసారి ఆ సీటు కోసం జగన్‌తో చర్చలు జరిపారా..? అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.

ఇదిలా ఉంటే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి వైసీపీ అభ్యర్థులు ఎవరనే విషయంపై జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్డిలను పెద్దల సభకు పంపాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరో సీటును టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి లేదా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్‌ సత్వానీకి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్‌ను సుబ్బరామిరెడ్డి కలవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇదిలా ఉంటే 250 మంది సభ్యులున్న రాజ్యసభలో వచ్చే నెలకు 55 మంది ఎంపీల పదవికాలం ముగియనుంది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి టి.సుబ్బరామిరెడ్డి, మొహమ్మద్‌ అలీ ఖాన్, సీతారామలక్ష్మి, కేవీపీ రామచంద్రరావు, కేశవరావులు ఉన్నారు. ఈ స్థానాలకు మార్చి 26న పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అందులో భాగంగా ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. Read This Story Also: సూసైడ్ చేసుకునేంత పిరికి వాడు కాదు.. తండ్రి ఆత్మహత్యపై అమృత..