హుజూర్ నగర్లో సిపిఎంకు షాక్..

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠగా మారిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఇందులో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్ధుల నామినేషన్లు భారీగా తిరస్కరణకు గురైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో వామపక్ష పార్టీలకు బలమైన క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్‌ ఉపఎన్నికలో సీపీఎం పార్టీ తమ అభ్యర్ధిగా పారేపల్లి శేఖర్‌రావును నిలిపింది. అయితే మంగళవారం జరిగిన పరిశీలనలో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఫారం-26తో పాటు, కుల సర్టిఫికెట్ […]

హుజూర్ నగర్లో సిపిఎంకు షాక్..
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 6:53 PM

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠగా మారిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఇందులో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్ధుల నామినేషన్లు భారీగా తిరస్కరణకు గురైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో వామపక్ష పార్టీలకు బలమైన క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో హుజూర్ నగర్‌ ఉపఎన్నికలో సీపీఎం పార్టీ తమ అభ్యర్ధిగా పారేపల్లి శేఖర్‌రావును నిలిపింది. అయితే మంగళవారం జరిగిన పరిశీలనలో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఫారం-26తో పాటు, కుల సర్టిఫికెట్ కు సంబంధించిన విషయమై పూర్తి అప్‌డేట్ లేదని రిటర్నింగ్ అధికారి గుర్తించారు. దీంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. పారేపల్లి శేఖర్‌రావు నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో సీపీఎం కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్ధానానికి 2014,2018 ఎన్నికల్లో కూడా సీపీఎం అభ్యర్ధిగా పారేపల్లి శేఖర్‌రావు పోటీ చేశారు. అయితే అప్పుడు దాఖలు చేసిన విధంగానే ఇప్పుడు చేసినా.. ఎందుకు రిజెక్ట్ చేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం నేతలు, కార్యకర్తలు హుజూర్‌నగర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మంగళవారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో సీపిఎం అభ్యర్థి పారేపల్లి శేఖ‌ర్‌రావు, తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి సాంబశివగౌడ్,స్వతంత్ర అభ్యర్థి వృద్ధురాలు లక్ష్మీ నర్సమ్మ,వికలాంగుడు గిద్ద రాజేష్, ఆమ్ ఆద్మీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు.  మొత్తం  76 నామినేషన్లను పరిశీలించి 45 నామినేషన్లు తిరస్కరించగా, 31 నామినేషన్లను ఓకే చేశారు  అధికారులు.