Breaking News
  • ఢిల్లీ: జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం. కోవిడ్‌ విజృంభణ తర్వాత ఏడోసారి ప్రధాని మోదీ ప్రసంగం. దేశంలో మరణాల రేటు తక్కువగా ఉంది. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగిద్దాం-ప్రధాని మోదీ. కరోనాను ఎదుర్కోవడంతో అగ్రదేశాల కంటే భారత్‌ మెరుగ్గా ఉంది. 10 లక్షల కేసుల్లో 83 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయి. అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది-మోదీ. ఏ మాత్రం ఆదమరిచినా ఇబ్బందులు తప్పవు-మోదీ. 10 లక్షల మందిలో ఐదున్నర వేల మందికే కరోనా సోకింది. కరోనాపై పూర్తి విజయం సాధించే వరకు పోరాటం ఆపొద్దు. కరోనా పరీక్షల కోసం 2 వేల ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది సేవా భావంతో పనిచేస్తున్నారు. భౌతిక దూరం పాటించండి.. మాస్కులు ధరించండి-మోదీ. మీరు.. మీ కుటుంబాలు సురక్షితంగా ఉండాలి-ప్రధాని మోదీ. త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటిపోతుంది-మోదీ.
  • విజయవాడ: సీపీ కార్యాలయ ఉద్యోగి మహేష్‌ హత్య కేసు. మహేష్‌ హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్‌. పదో తేదీ రాత్రి 10 గంటలకు మహేష్‌ను కాల్చి చంపారు. కేసులో కీలక ఆధారాలు లభించాయి. గన్‌కు సంబంధించిన వివరాలు సేకరించాం. సాకేత్‌రెడ్డి, గంగాధర్‌ కలిసి మహేష్‌ హత్య చేశారు. సాకేత్‌ లాక్‌డౌన్‌లో గయ వెళ్లి గన్‌ను కొనుగోలు చేశాడు. -విజయవాడ సీపీ శ్రీనివాసులు. బాలుడిని కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేద్దామని సందీప్‌ స్కెచ్‌. సందీప్‌ను హైదరాబాద్‌ నుంచి సాకేత్‌ పిలిపించాడు.
  • ఏపీలో కొత్తగా 3,503 కరోనా కేసులు, 28 మంది మృతి. ఏపీలో మొత్తం 7,89,553 కేసులు, 6,481 మంది మృతి. ఏపీలో 33,396 యాక్టివ్‌ కేసులు, 7,49,676 మంది డిశ్చార్జ్‌.
  • విజయవాడ: ఈ రోజు 11,981 మంది దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ రోజు సా.6 గంటల వరకు రూ.14,54,345 ఆదాయం వచ్చింది. రేపు 13 వేల మందికి అమ్మవారి దర్శనం కల్పిస్తాం. రేపు తె.3 గంటల నుంచి రా.9 గంటల వరకు దర్శనాలు. రేపు మ.3 గంటలకు అమ్మవారికి సీఎం జగన్‌ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. -దుర్గగుడి ఈవో సురేష్‌బాబు.
  • హైదరాబాద్‌ ముంపు సమస్యమీద విస్తృతమైన చర్చ జరగాలి. టీవీ9 ఓ వెబినార్‌ పెడితే అందరి అభిప్రాయాలు తెలుస్తాయి. హైదరాబాద్‌లో ఎన్డీఎంఏ రిపోర్ట్‌ ఎందుకు అమలు కావడం లేదు. ఫిరంగినాలా ఆక్రమణే పాతబస్తీ మునిగేందుకు కారణం. -బిగ్‌ డిబేట్‌లో పర్యావరణవేత్త ప్రొఫెసర్‌ పురుషోత్తంరెడ్డి.
  • తుంగభద్ర పుష్కరాలు ప్రారంభించాలని సీఎం జగన్‌కు ఆహ్వానం. సీఎంను ఆహ్వానించిన మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం ప్రతినిధులు.
  • శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 10 గేట్లు ఎత్తివేత. ఇన్‌ఫ్లో 3,26,466 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 4,03,188 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు. ప్రస్తుత నీటినిల్వ 211 టీఎంసీలు.

బీహార్ ఎన్నికలకు ఈసీ మార్గదర్శకాలు

కరోనా మహమ్మారి ఒకవైపు దేశాన్ని వణికిస్తోంది. మరోవైపు గడువు ముగుస్తున్న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది.

election commission tweaks timing on bihar assembly polls, బీహార్ ఎన్నికలకు ఈసీ మార్గదర్శకాలు

కరోనా మహమ్మారి ఒకవైపు దేశాన్ని వణికిస్తోంది. మరోవైపు గడువు ముగుస్తున్న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. కరోనా వైరస్ కాలంలో దేశంలో మొదటిసారి ఎన్నికలు జరగబోతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఈసీ. బీహార్ ఎన్నికలపై రాజకీయాలతో కొవిడ్-19 తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఈసీ పలు మార్గదర్శాలు జారీ చేసింది. కొవిడ్ నిబంధనలు అనుసరించి పోలింగ్ నిర్వహించాలని సూచించింది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసింది. పోలింగ్‌ను ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహించనున్నారు. ఇంతకు ముందు కొన్ని ప్రత్యేక సందర్భాలు తప్పితే సాయంత్రం 5 వరకే నిర్వహించేవారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గంట పొడగించినట్లు ఈసీ పేర్కొంది. అయితే, వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో ఇది వర్తిందని ఈసీ తెలిపింది. కొవిడ్-19 అనంతరం జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఓటర్లు భౌతిక దూరాన్ని పాటించాలని, తప్పని సరిగా సానిటైజ్ చేసుకోవాలని వెల్లడించింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఓటర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని దీనిని తప్పనిసరి చేసినట్లు వారు పేర్కొన్నారు. అంతే కాకుండా 7.2 కోట్ల గ్లౌజులను ఏర్పాటు చేసినట్లు, ఓటు వేసే సమయంలో ఓటర్లు ఇవి తప్పనిసరిగా ఉపయోగించాలని ఈసీ తెలిపింది. పోలింగ్ కేంద్రాల వద్ద మొత్తంగా 45 లక్షల మాస్కులు, 7 లక్షల సానిటైజర్లు, 6 లక్షల పీపీఈ కిట్లు, 6.7 లక్షల ఫేస్ షీల్డులు, 23 లక్షల చేతి తొడుగులు ఎన్నికల సిబ్బంది కోసం ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో మూడు విడుతలుగా జరిగే ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం దృష్టినీ ఆకర్షించబోతున్నాయి. ఆయా దేశాల్లో జరిగే ఎన్నికలకు బహుశా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మార్గదర్శం అవుతాయనే చర్చ కూడా సాగుతోంది. కొవిడ్ తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి బీహార్ ఎన్నికలు.

Related Tags