Breaking News
  • కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు చంద్రబాబు లేఖ. నరేగా పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని వినతి. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. నిధులు విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచింది. గతంలో నరేగా పనులు చేసినవారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది -లేఖలో చంద్రబాబు.
  • పదేళ్లలో జమ్మికుంట-హుజూరాబాద్‌ నగరాలు కలిసిపోతాయి. జంట నగరాలకు మున్సిపల్ చైర్మన్లుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా.. కేసీఆర్‌ నన్ను నియమించారు-వినోద్‌కుమార్‌. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి -ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్.
  • కడప: పోరుమామిళ్ల మండలం మార్కాపురం దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని సిలాస్‌ అనే వ్యక్తికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • నగరపాలక, మున్సిపల్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశాం. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో రేపు ఓట్ల లెక్కింపు. ఈ నెల 27న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నికలు. ఈనెల 29న కరీంనగర్‌ మేయర్‌ ఎన్నిక-నాగిరెడ్డి. రేపు సాయంత్రంలోగా అన్ని ఫలితాలు వస్తాయి. పార్టీలు మేయర్‌, చైర్‌పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఇవ్వాలి. ఈ నెల 26న ఉ.11 గంటలలోగా ఏ ఫామ్‌ ఇవ్వాలి. ఈ నెల 27న ఉ.11 గంటలలోగా బీ ఫామ్‌ ఇవ్వాలి -తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి.
  • శాసనమండలి తీరుపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆగ్రహం. మంచి వ్యక్తితో తప్పుడు పనిచేయించిన చంద్రబాబును ఎవరూ క్షమించరు. వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని అడిగే హక్కు టీడీపీకి లేదు. ముందు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్లాలి -ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

కె.ఎ.పాల్‌కు ఈసీ షాక్‌.. రద్దు దిశగా పార్టీ గుర్తు

, కె.ఎ.పాల్‌కు ఈసీ షాక్‌.. రద్దు దిశగా పార్టీ గుర్తు

మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన పార్టీకి కేటాయించిన హెలికాప్టర్ గుర్తును పక్కనపెట్టింది. ఆయన హెలికాప్టర్‌ గుర్తు తమ పార్టీ గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉండడంతో ఎన్నికల్లో తమకు నష్టం జరిగే అవకాశం ఉందని, అందువల్ల దాన్ని తొలగించాలని వైసీపీ మాజీ ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ పాల్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన పాల్‌ ప్రపంచంలో ఎక్కడైనా హెలికాప్టర్‌, ఫ్యాన్‌ ఒకేలా ఉండడం చూశామా? ఇందులో వైసీపీ దురుద్దేశం ఉందని ఆరోపించారు. రెండు గుర్తుల మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా గుర్తించగలరని ఈసీకి సమాధానమిచ్చారు. పాల్‌ స్పందనను పెద్దగా పట్టించుకోని ఈసీ.. ఆయన గుర్తును పక్కన పెడుతూ నిర్ణయం తీసుకుంది.

అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలానే గుర్తుల గొడవ జరిగింది. టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుతో పొలి ఉన్న ట్రక్కు గుర్తును పలువురు ఇండిపెండెంట్లకు కేటాయించారు. అయితే వీరందరికీ అంచనాలకు మించి ఓట్లుపడ్డాయి. కారు, ట్రక్కూ రెండూ ఒకేలా ఉండటంతో ప్రజలు పొరపాటున ట్రక్కుకు వేశారని టీఆర్ఎస్ అభ్యర్ధులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చారు ట్రక్కు గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థులు. తమకు పడాల్సిన ఓట్లు కారు గుర్తుకు పడ్డాయనీ, కారణం ట్రక్కు, కారు గుర్తులు ఒకేలా ఉండటమేనని అన్నారు. ఈ రెండు వాదనలూ విన్న ఎన్నికల సంఘం… ప్రస్తుతానికి ట్రక్కు గుర్తును పక్కన పెట్టింది. ఇకపై ఎక్కడ ఎన్నికలు జరిగినా… గుర్తుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్న ఈసీ… హెలికాఫ్టర్ గుర్తును రద్దు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఐతే పాల్ మాత్రం హెలికాఫ్టర్ గుర్తు తొలగించకుండా ఉండాలని కోరుకుంటున్నారు.