ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఐదేళ్ల ఐటీఆర్ తప్ప‌నిసరి

ఇప్పటినుంచి ఎన్నికల్లో పోటీచేసే వారు గత ఐదేళ్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఖ‌చ్చితంగా సమర్పించాలని కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే క్రమంలో ఎన్నికల అభ్యర్థి ఖ‌చ్చితంగా పాన్ నెంబర్‌ను తెలియజేయాల్సి ఉంటుంది. విదేశాల్లోని ఆస్తుల లెక్క కూడా చెప్పాలి. నామినేషన్ సమయంలో ఎన్నికల అభ్యర్థితోపాటు భాగస్వామి, కుబుంబ సభ్యులు, తనపై ఆధారపడ్డవారు కూడా అన్ని వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఫామ్ 26లో కేంద్రం పలు మార్పులు చేసింది. వచ్చే ఎన్నికల్లో […]

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఐదేళ్ల ఐటీఆర్ తప్ప‌నిసరి
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2019 | 1:05 PM

ఇప్పటినుంచి ఎన్నికల్లో పోటీచేసే వారు గత ఐదేళ్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఖ‌చ్చితంగా సమర్పించాలని కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే క్రమంలో ఎన్నికల అభ్యర్థి ఖ‌చ్చితంగా పాన్ నెంబర్‌ను తెలియజేయాల్సి ఉంటుంది. విదేశాల్లోని ఆస్తుల లెక్క కూడా చెప్పాలి. నామినేషన్ సమయంలో ఎన్నికల అభ్యర్థితోపాటు భాగస్వామి, కుబుంబ సభ్యులు, తనపై ఆధారపడ్డవారు కూడా అన్ని వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది.

దీనికి సంబంధించి ఫామ్ 26లో కేంద్రం పలు మార్పులు చేసింది. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులందరికీ తాజా మార్పులు వర్తిస్తాయి. ఇప్పటి వరకు అయితే ఎన్నికల అభ్యర్థి నామినేషన్ సమయంలో ఒక ఏడాది ఐటీఆర్ వివరాలు సమర్పిస్తే సరిపోయేది. విదేశాల్లోని ఆస్తుల ప్రస్తావన ఉండేది కాదు.