Breaking News
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌. జిల్లాలోని 9 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌. జనగాం, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్‌.. వర్ధన్నపేట, డోర్నకల్‌, తొర్రూర్‌, మరిపెడలో టీఆర్‌ఎస్‌ విజయం. జనగాం: టీఆర్‌ఎస్‌-13, కాంగ్రెస్‌-10, బీజేపీ-4, ఇతరులు-3. భూపాలపల్లి: టీఆర్‌ఎస్‌-23, బీజేపీ-1, ఇతరులు-6. పరకాల: టీఆర్‌ఎస్‌-17, బీజేపీ-3, కాంగ్రెస్‌-1, ఇతరులు-1. నర్సంపేట: టీఆర్‌ఎస్‌-16, కాంగ్రెస్‌-6, ఇతరులు-2. తొర్రూరు: టీఆర్‌ఎస్‌-12, కాంగ్రెస్‌-3, బీజేపీ-1. వర్ధన్నపేట: టీఆర్‌ఎస్‌-8, కాంగ్రెస్‌-2, బీజేపీ-1, ఇతరులు-1. డోర్నకల్‌: టీఆర్‌ఎస్‌-11, కాంగ్రెస్‌-1, ఇతరులు-3. మహబూబాబాద్‌: టీఆర్ఎస్‌-19, కాంగ్రెస్‌-10, ఇతరులు-7. మరిపెడ: టీఆర్‌ఎస్‌-15.
  • రైతులపై దాడి చేయించిన జగన్‌ రైతు ద్రోహిగా మరింత దిగజారారు. మూడు రాజధానుల్లో ఆయన స్వార్థం తప్ప రాజధానులు లేవని.. ప్రజలకు అర్థమైందన్న ఆందోళన జగన్‌ను వెంటాడుతోంది-లోకేష్‌. వైసీపీ రౌడీలను రంగంలోకి దింపి జేఏసీ శిబిరానికి నిప్పంటించారు. తెనాలిలో వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం-నారా లోకేష్‌. జగన్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరూ లేరు-ట్విట్టర్‌లో నారా లోకేష్‌.
  • చిత్తూరు: గ్రేడ్‌-3 మున్సిపాలిటీగా కుప్పం గ్రామ పంచాయతీ. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం. ఏడు గ్రామపంచాయతీలను కుప్పం మున్సిపాలిటీలో విలీనం. కుప్పం మున్సిపాలిటీలో చీలేపల్లి, దళవాయి కొత్తపల్లి, చీమనాయనపల్లి.. సామగుట్టపల్లి, తంబిగానిపల్లి, కమతమూరు, అనిమిగానిపల్లి విలీనం. చంద్రబాబు నియోజకవర్గానికి మున్సిపాలిటీ హోదా కల్పించిన ప్రభుత్వం.
  • కరీంనగర్‌: తిమ్మాపూర్‌ దగ్గర ఎస్సారెస్పీ కెనాల్‌లో కారు బోల్తా. కారులో ఉన్న దంపతులు మృతి. మృతులు సుల్తానాబాద్‌ వాసులుగా గుర్తింపు.
  • విశాఖ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా హై అలర్ట్. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు భద్రత పెంపు.

లక్కీ డ్రాలో ఎంపీపీగా ఎన్నికైన కాంగ్రెస్ సభ్యురాలు

Elected Congress MP wins lucky draw for MPP, లక్కీ డ్రాలో ఎంపీపీగా ఎన్నికైన కాంగ్రెస్ సభ్యురాలు

రాజకీయాల్లో అందలం దక్కాలంటే ప్రజాభిమానంతోపాటు అదృష్టం కూడా కలిసిరావాలి. ఇందుకు మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎంపీపీగా ఎన్నికైన హాలావత్‌ జ్యోతి ఉదాహరణ. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజా తీర్పు అనుకూలంగానే ఉన్నా అవసరమైన పూర్తి బలం రాకపోవడంతో చివరికి అదృష్టాన్నే నమ్ముకోక తప్పలేదు . అనుకున్నట్టే లాటరీలో అదృష్టం ఆమెనే వరించింది. నర్సాపురం మండలంలో మొత్తం పది ఎంపీపీటీసీ స్థానాలున్నాయి. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ చెరో ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. బలం సమానంగా ఉన్నందున ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ, కో ఆప్షన్‌ సభ్యులను లాటరీ పద్ధతిలో ఎన్నుకోవాలని అధికారులు నిర్ణయించారు. నర్సాపూర్‌లోని మండల పరిషత్‌ కార్యాలయంలో లాటరీ తీశారు. అదృష్టం కాంగ్రెస్‌ ఎంపిటీసీ సభ్యురాలు హలావత్‌ జ్యోతి తలుపుతట్టింది. దీంతో పదవిపై బోలెడు ఆశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ నాయకురాలు, చిప్పల్‌తుర్తి ఎంపీటీసీ సభ్యురాలు సంధ్యారాణినాయక్‌కు నిరాశే ఎదురైంది. అయితే ఉపాధ్యక్షుడు, కో ఆప్షన్‌ సభ్యుడి పదవులు మాత్రం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి దక్కడంతో ఆ పార్టీ నాయకులు కొంత సంతృప్తి చెందారు.