ఆకలితో వృద్ధురాలు.. గదికి తాళం ఉండటంతో..

Old women Jumps from building

అసలే వృద్ధురాలు.. పైగా మతిమరుపు సమస్య. కొడులులేకపోవడంతో కూమార్తెలే ఆమె యోగక్షేమాలు చూస్తున్నారు. అయితే ఉదయాన్నే ఆమెకు కావాల్సిన వాటిని అందించి వెళ్లిపోతారు. అయితే వృద్ధురాలికి ఆకలి వేయడంతో ఏకంగా తానున్న మేడమీదినింది దూకే ప్రయత్నం చేయడం కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే పార్వతీపురం బందంవారి వీధిలో వారణాసి భూదేవి తన సొంత నివసిస్తోంది. ఒంటరిగా ఉంటున్న ఆమెను కుమార్తెలే చూసుకుంటున్నారు. వారు ప్రతిరోజు వచ్చి చూసువెళ్తుంటారు.

ఆదివారం కూడా ఉదయన్నే వచ్చి వృద్ధురాలికి టిఫిన్ ఇచ్చి వెళ్లారు. మళ్లీ సాయంత్రం వరకు తిరిగి రాలేదు. దీంతో వృద్ధురాలకి బాగా ఆకలిసేంది. గదిలో ఎలాంటి ఆహార పదార్ధాలు కూడా లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక బయటికి వెళ్లాలనుకుంది. తను ఉన్న గదికి తాళం పెట్టి ఉండటంతో కిందికి దిగే అవకాశం లేకపోయింది. ఇక చేసేదేమీలేక మేడమీదనుంచి దూకి ఆకలి తీర్చుకోవాలనుకుంది. ఈ ప్రయత్నంలో బిల్గింగ్ మీదనుంచి కిందికి దిగే ప్రయత్నం చేస్తుండగా ఆ వీధిలో ఉన్న కొందరు చూసి కంగారు పడ్డారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో పట్టణ మహిళా ఎస్సై జయంతి తన సిబ్బందితో సహా అక్కడికి చేరుకుని.. ఓ యువకుడి సాయంతో నిచ్చెనవేసి వృద్దరాలిని లోపలికి పంపారు. వృద్ధురాలు భూదేవికి స్ధానికులు పండ్లు, ఆహారం వంటివి పంపించారు. వాటిని తిన్న తర్వాత ఆకలి తీరి … తాను బాగానే ఉన్నానని చెప్పినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జయంతి స్ధానిక పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *