‘ మా రాష్ట్రంలో 80 శాతం రోగుల్లో కరోనా లక్షణాలే లేవు’.. ఉధ్ధవ్ థాక్రే

తమ రాష్ట్రంలోని 80 శాతం రోగుల్లో కరోనా వ్యాధి లక్షణాలే లేవని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే వెల్లడించారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో .. దేశంలోనే అత్యధికంగా 7,628 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా-లాక్ డౌన్ పొడిగింపుపై ఈ నెల 30 తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామని ఉధ్ధవ్ తెలిపారు.

' మా రాష్ట్రంలో 80 శాతం రోగుల్లో కరోనా లక్షణాలే లేవు'.. ఉధ్ధవ్ థాక్రే
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 26, 2020 | 8:16 PM

తమ రాష్ట్రంలోని 80 శాతం రోగుల్లో కరోనా వ్యాధి లక్షణాలే లేవని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే వెల్లడించారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో .. దేశంలోనే అత్యధికంగా 7,628 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా-లాక్ డౌన్ పొడిగింపుపై ఈ నెల 30 తరువాత ఒక నిర్ణయం తీసుకుంటామని ఉధ్ధవ్ తెలిపారు. డాక్టర్లు మళ్ళీ క్లినిక్ లను ప్రారంభించాలని, డయాలిసిస్ సెంటర్లను మొదలు పెట్టాలని ఆయన సూచించారు. ఈ విధమైనతరుణంలోనే ప్రజలు సహనంతో ఉండాలని కోరారు.  ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని చెప్పిన ఆయన.. కేంద్రం సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హై రిస్క్ గ్రూపును సేఫ్ గా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పారు. ఈ సమయంలో ఎవరూ సొంత వైద్యం చేసుకోరాదని, ఏ మాత్రం అనుమానం కలిగినా వైద్య సిబ్బందిని సంప్రదించాలని ఆయన కోరారు.