కరోనాపై ఆరోగ్య మంత్రి సమీక్ష.. ఆ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలు

దేశంలో కరోనా విస్తరణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల మార్కును క్రాస్ చేయగా.. మరణాల సంఖ్య 16వేలను దాటేసింది.

కరోనాపై ఆరోగ్య మంత్రి సమీక్ష.. ఆ లిస్ట్‌లో తెలుగు రాష్ట్రాలు
Follow us

| Edited By:

Updated on: Jun 27, 2020 | 10:08 PM

దేశంలో కరోనా విస్తరణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 5 లక్షల మార్కును క్రాస్ చేయగా.. మరణాల సంఖ్య 16వేలను దాటేసింది. కాగా దేశం మొత్తంలో ఉన్న యాక్టివ్ కేసుల్లో 85.5%.. మరణాల్లో 87% ఎనిమిది రాష్ట్రాల్లోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఆ జాబితాలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయని ఆయన అన్నారు. కరోనా తీవ్రతపై హర్షవర్ధన్ నేతృత్వంలోని కేంద్రమంత్రుల ప్రత్యేక బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా కరోనా కట్టడి చర్యలపై సమీక్షించారు.

మరోవైపు రాష్ట్రాలకు సాంకేతికంగా సాయం అందించేందుకు 15 బృందాలను ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాలకు కేంద్రం అందుబాటులో ఉంచనుంది. ఇక ఇందులో ఓ కేంద్ర బృందం గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. కాగా దేశంలో ఇప్పటివరకు 2,95,881 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. రికవరీ రేటు 58%పైగా నమోదైంది. ఇక మరణాల రేటు 3శాతంగా ఉండగా.. ప్రస్తుతం దేశంలో దాదాపు 1.98 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి.